Mehaboob: మెహబూబ్ ఎమోషనల్ పోస్ట్… మీ వల్లే అంటూ కామెంట్స్..!

‘బిగ్ బాస్ 4’ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు యూట్యూబర్ మెహబూబ్. అతను హౌస్ లో తక్కువ రోజులే ఉన్నప్పటికీ… తన ఎనర్జిటిక్ డ్యాన్స్ లతో, అర్జున్ రెడ్డి స్టయిల్ యాంగర్ తో ప్రేక్షకులను అలరించాడు.ఇక అతను ఎలిమినేట్ అయ్యాక కూడా ఖాళీగా ఏమి లేడు. వరుసగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ తన ఫాలోవర్స్ సంఖ్యను మరింతగా పెంచుకున్నాడు. ఇతనికి సినిమా ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి.

‘బిగ్ బాస్4’ ఫినాలే లో మెగాస్టార్ చిరంజీవి ఇతన్ని పొగుడుతూ చేసిన కామెంట్స్ ఇతని కెరీర్ కు బాగా హెల్ప్ అయ్యాయి. అంతేకాకుండా మెహబూబ్ కు కొంత ఆర్ధిక సాయం కూడా చేశారు మెగాస్టార్ చిరంజీవి. దాంతో అతని పేరు మరింతగా మార్మోగింది. ఇదిలా ఉండగా సొంత ఇళ్ళు కట్టుకోవడం కల అని హౌస్ లో ఉన్నప్పుడు మెహబూబ్ చాలా సార్లు అన్నాడు. మొత్తానికి తాను అనుకున్నట్టుగానే సొంతిల్లు కట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోల్ని తన సోషల్‌ మీడియాలో షేర్ చేసి..

కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసాడు మెహబూబ్.”మాకంటూ ఓ సొంతిల్లు ఉండాలి, కట్టుకోవాలని చిన్నప్పటి నుండీ కోరిక ఉండేది. మొత్తానికి అది నెరవేరింది. మీ వల్లే ఇది సాధించగలిగాను. మమ్మల్నిదీవించిన భగవంతుడికి కృతజ్ఞతలు. అలాగే నాకు సపోర్ట్‌ చేసిన అభిమానులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు మెహబూబ్. అతని పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus