ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆట రసవత్తరంగా మారింది. ముఖ్యంగా టాప్ – 5 ఎనాలసిస్ అనేది చెప్పలేని పరిస్థితిగా మారింది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఎవరైనా కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. వచ్చే రెండు మూడు వారాలు ఖచ్చితంగా గేమ్ లో ఎవరు ఉంటారు ? ఎవరు వెళ్లిపోతారు అనేది చెప్పలేని పరిస్థితి. అయితే, ఇక్కడే సన్నీకి వచ్చిన ఎవిక్షన్ పాస్ ఎవరికోసం వాడతాడు అనేది కూడా చూడాలి. ఈవారం కాజల్ ఇంకా పింకీ చివర్లో నామినేషన్స్ లో ఉంటే సన్నీ పాస్ వాడితే అది వేస్ట్ అయిపోతుంది.
అలా కాకుండా, నెక్ట్స్ వీక్ బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వాలి అనుకుంటే, మానస్ ఇంకా కాజల్ ని లాస్ట్ వరకూ ఉంచుతాడు. వారిలో ఎవరికి పాస్ వాడాలి ఎవరికి వాడద్దు అనేది అగ్నిపరీక్షలాగా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలిమినేషన్ ప్రక్రియలో వచ్చే వారం సన్నీ ఇంకా కాజల్ ఇద్దరూ ఉన్నారు అనుకున్నా కూడా ఇద్దరూ నామినేషన్స్ లాస్ట్ వరకూ వస్తే తనకోసం వాడతాడా.. కాజల్ కోసం వాడతాడా అనేది ఇంట్రస్టింగ్. ఒకవేళ కాజల్ ఈ టైమ్ లో సేఫ్ అయితే మాత్రం టాప్ 5లోకి వస్తుంది.
ఒకవేళ రేస్ టు ఫినాలే టాస్క్ లో సపోర్టింగ్ తో గెలిచినా కూడా ఢోకా ఉండదు. అప్పుడు మేల్ కంటెస్టెంట్స్ అయిన మానస్ ఇంకా రవి డేంజర్ జోన్ లో ఉంటారు. అయితే, బిగ్ బాస్ ఇక్కడే సన్నీకి ట్విస్ట్ ఇవ్వబోతుందా అనే అనిపిస్తోంది. మానస్ ఇంకా కాజల్ ఇద్దరినీ వచ్చేవారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉంచి ఎవరికోసం పాస్ వాడతావ్ అని అడిగితే మాత్రం ఖచ్చితంగా సూప్ లో పడతాడు. జాగ్రత్తగా ఎవరు ఎలిమినేట్ అవుతారో గ్రహించి ఇమ్మని చెప్పినా కూడా గెస్ చేయడం కష్టం అవుతుంది.
ఎందుకంటే, ప్రస్తుతం అన్ అఫీషయల్ పోలింగ్స్ చూస్తే గత రెండు మూడు వారాలుగా కాజల్ మానస్ ని దాటేసింది. అప్పుడు కాజల్ ని సేఫ్ చేస్తే మానస్ ఎలిమినేట్ అయితే పాస్ వేస్ట్ అవుతుంది. అందుకే, ఇప్పుడు సన్నీకి అగ్నిపరీక్ష ఎదురవ్వబోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా సన్నీ ఎవరికోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడతాడు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?