బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ గజ్జర్ ఎలిమినేషన్ అవ్వకముందు అందరితో సరదాగా మాట్లాడింది. శనివారం ఎపిసోడ్ లో పార్టిసిపెంట్స్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎవరి పై ఎలా ఉంది..? అలాగే ఇప్పుడున్న ఇంప్రెషన్ ఏంటి అనేది గేమ్ ఆడారు. ఇక్కడే అభిజిత్ అరియానా, హారిక, సోహైల్‌కు లైక్ ఇచ్చి, మిగతా ఇద్దరికి మోనాల్ ఇంకా అఖిల్ కి డిస్లైక్ ఇచ్చాడు. మోనాల్‌ను చూడగానే హైపర్ అనిపించిందని చెప్పాడు. ఇక ఈ బిగ్‌బాస్ షో పూర్తి అయిపోయాక ఓసారి గుజరాత్‌కు వెళ్తానన్నాడు. మోనాల్‌ను, వాళ్ల అమ్మగారిని ఒకసారి కలిసి మాట్లాడాలని ఉందని చెప్పాడు.
తర్వాత ఆదివారం ఎపిసోడ్ లో మోనాల్ వెళ్లిపోతుంటే హౌస్ మేట్స్ అందరూ బాగా బాధపడ్డారు. అఖిల్ అయితే విస్మయానికి గురి అయ్యాడు. మోనాల్ నిజంగా టాప్ – 5 లో ఉంటుందని ఆశపడ్డాడు అఖిల్. కానీ, అనూహ్యంగా అరియానా సేఫ్ అయ్యింది. మోనాల్ ఎలిమినేట్ అయ్యింది.
హౌస్ మేట్స్ అందరూ కూడా అరియానా ఈవారం ఎలిమినేట్ అయిపోతుందనే అనుకున్నారు. కానీ, మోనాల్ ఎలిమినేట్ అయ్యింది. అరియానా టాప్ – 5 లోకి వచ్చింది. మోనాల్ వెళ్లిపోయేటపుడు ముఖ్యంగా అఖిల్ అండ్ సోహైల్ ఇద్దరూ కూడా చాలా బాదాపడ్డారు. ఫినాలే అయ్యాక గుజరాత్ వస్తాం అంటూ ప్రామిస్ చేశారు. మోనాల్ కి సెండాఫ్ ఇచ్చారు. అఖిల్ అయితే ఉండిపోరాదే అని సాంగ్ పాడి ఎమోషనల్ అయ్యాడు. అదీ విషయం.