Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ఓటీటీలో ఎలా ఉండబోతోందో తెలుసా..?

బిగ్ బాస్ ఓటీటీలో వచ్చేందుకు అంతా రెడీ అయిపోయింది. ఫిబ్రవరి 26వ తేది సాయంత్రం 6 గంటల నుంచీ ఈ రియాలిటీ షోని ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో అందర్నీ ఆకట్టుకుంటోంది. 18మంది సెలబ్రిటీలు ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నట్లుగా ముందుగానే ప్రకటించారు. ఈసారి సీజన్ లో సీనియర్స్ అంటే ఆల్రెడీ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన కొందరు, అలాగే జూనియర్స్ అంటే ఫ్రెష్ గా బిగ్ బాస్ వచ్చేవాళ్లు కలిసి హౌస్ లోకి వెళ్లబోతున్నారు.

Click Here To Watch

ఈ రియాలిటీ షోని 24గంటలు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా డిస్నీ హాట్ స్టార్ లో ప్రజెంట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకూ డిస్నీ హాట్ స్టార్ లో వచ్చే బిగ్ బాస్ రియాలిటీ షో కేవలం 1గంట 40నిమిషాలు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు 24గంటలు లైవ్ లో ఈ రియాలిటీ షో ఉండబోతోంది. అంటే, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏంజరుగుతోందో చూసి తెలుసుకోవచ్చన్నమాట.

గతంలో కేవలం బిగ్ బాస్ టీమ్ హైలెట్స్ అయినవాటిని మాత్రమే టెలికాస్ట్ చేసేవారు. దీనివల్ల అప్పటికప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది తెలిసేది. ముఖ్యంగా టాస్క్ లు ఆడేటపుడు వాళ్లు టెలికాస్ట్ చేసిన విధానం వల్లే ఆడియన్స్ ఒక ఓపీనియన్ కి వచ్చేవారు. కానీ, ఇప్పుడు 24గంటల లైవ్ అనేది అటు పార్టిసిపెంట్స్ కి మాత్రమే కాదు, ఇటు చూసేవారికి కూడా కొత్త అనుభూతిని ఇస్తుందని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది.

ఈ ఓటీటీ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 ఇలా అన్ని సీజన్స్ నుంచీ కొంతమందిని సెలక్ట్ చేసి వారిని హౌస్ లోకి పంపించబోతున్నారు. అలాగే, బిగ్ బాస్ కోసం కొంతమంది కొత్తవారిని కూడా సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపిస్తున్నారు. వీరిద్దరి మద్యలో బాటిల్ ఎలా ఉండబోతోంది. ? ఫైటింగ్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

ఓటీటీ ట్రెండ్ బాగా నడుస్తున్న ఈ డిజిటల్ రోజుల్లో ఇలాంటి రియాలిటీ షోలకి వ్యూవర్ షిప్ ఎక్కుగానే కనిపిస్తుందని చెప్తున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మాత్రం దుమ్మురేపేలాగానే కనిపిస్తోంది. అంతేకాదు, ఓటీటీ కాబట్టి అడల్డ్ కంటెంట్ కూడా గట్టిగా ఉండేలాగానే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. అదీ మేటర్.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!


ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus