సరయు పరిచయం అవసరం లేని పేరు సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా బోల్డ్ కంటెంట్ వీడియోలతో పెద్ద ఎత్తున బూతులు మాట్లాడుతూ ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయ్యారు. సరయూ వీడియోస్ అంటేనే బోల్ట్ కంటెంట్ ఉంటుంది. ఇలా యూట్యూబర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి సరయు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.
బిగ్ బాస్ కార్యక్రమం ఒక చెత్త షో అని ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమాన్ని చూడటం టైం వేస్ట్ అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచినటువంటి ఈమె మరోసారి రామ్ చరణ్ గురించి పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సరయు మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. రామ్ చరణ్ అంటే తనకు విపరీతమైన అభిమానమని తెలిపారు.
రాంచరణ్ పెళ్లి రోజున తాను చాలా బాగా ఏడ్చానని ఈమె (Sarayu) అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో డేటింగ్ చేసే అవకాశం వస్తే అసలు వదులుకోను అంటూ ఈమె రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.
అసలు తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఏమాత్రం లేదని తెలిపారు. పెళ్లిపై తనకు నమ్మకం లేదని పెళ్లి చేసుకోవడం శుద్ధ వేస్ట్ అంటూ పెళ్లి గురించికామెంట్స్ చేస్తూ లైఫ్ టైం బ్యాచిలర్ గానే ఉండిపోతానని తెలియజేశారు. ఇలా పెళ్లి గురించి రామ్ చరణ్ గురించి సరయు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.