Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: 11వ రోజు ఏం చూపించారంటే?

బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: 11వ రోజు ఏం చూపించారంటే?

  • September 18, 2020 / 09:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: 11వ రోజు ఏం చూపించారంటే?

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ మొదలై 11 రోజులు అయిపోయంది. ఇంట్లో పెద్ద డ్రామా, ఎమోషన్స్‌ పండకపోయినా వినోదం అయితే ట్రై చేస్తున్నారు. ఈ రోజు కూడా అదే పని చేశారు. ఇంకా ఈ రోజు ఏం జరిగాయో చూద్దాం…

* బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్న అబ్బాయిల్లో బాయ్‌ ఫ్రెండ్‌గా నువ్వు ఎవరిని ఎంచుకుంటావ్‌’ అనే హారిక వేసే ప్రశ్నతో 11వ రోజు బిగ్‌బాస్‌ మొదలైంది. లాస్య, సుజాత, హారిక, అభిజీత్‌ ముచ్చట్లలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఇక్కడ బాయ్‌ ఫ్రెండ్‌ను వెతుక్కోకపోతే నిన్ను బయటకు పంపం అని బిగ్‌బాస్‌ అంటే ఏం చేస్తావో చెప్పు అని ముగ్గురూ సుజాతను అడిగారు. మధ్యలో సుజాత లేచి వెళ్లిపోవడానికి సిద్ధమైనా ఆపేసి మరీ అడిగారు. ‘అఖిల్‌నా’ అంటూ అభిజీత్‌ ఆప్షన్‌ కూడా ఇచ్చాడు. దానికి సుజాత్‌ ‘ఛీ’ అంటూ ఓ లుక్‌ ఇచ్చి.. మళ్లీ నాలుక కరుచుకుంది. తర్వాత సోహైల్‌ పేరు కూడా చర్చకు వచ్చింది. నోయల్‌ పేరు కూడా అనుకున్నారు. దానికి సుజాత అందుకొని ‘నన్ను అందరూ అక్క’ అని పిలుస్తారు కదా అంది. దాంతో చర్చ ఆపేశారు. ఫైనల్‌గా సుజాత స్వయంవరం అలా అర్ధంతరంగా ఆగిపోయింది.

* అఖిల్‌ – మోనాల్‌ మధ్య ఏమన్నా నడుస్తోందా అనే ప్రశ్న అభిజీత్‌ -హారిక మధ్య చర్చకు వచ్చింది. అయితే ఇద్దరూ కలసి ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల అలా అనిపిస్తుందేమో అని ఫైనల్‌గా అనుకున్నారు. అందరూ తనను ఈ మాటే అడుగుతున్నారు అని అభిజీత్‌ చిరాకుగా చెప్పాడు. దీనికి ఆన్సర్‌ అఖిల్‌- మోనాల్‌ కలసి చెప్పాలి. వీకెండ్‌లో నాగార్జున చెప్పిస్తాడేమో.

* అభిజీత్‌ – లాస్య – హారిక- సుజాత మధ్య సరదాగా జరిగిన ‘బాయ్‌ ఫ్రెండ్‌’ డిస్కషన్‌ విషయంలో సుజాత బాగా హర్ట్‌ అయ్యింది. ఏదో సరదాగా అనుకున్న మాటలు, కౌంటర్లకు బాగా బాధపడిపోయింది. ఆ తర్వాత అదే విషయాన్ని నోయల్‌కు చెప్పింది. నోయల్‌ కూడా అదేం పట్టించుకోవద్దు అంటూ కూల్‌ చేసేశాడు.

* రోజూ ఉదయం పాటలతో నిద్రలేపే బిగ్‌బాస్‌ ఈ రోజు ఓ గంభీరమై/ ఫన్నీ వాయిస్‌తో నిద్రలేపాడు. అందరినీ గార్డెన్‌ ఏరియాలోకి రమ్మని చెప్పాడు. సోహైల్‌, నోయల్‌ కాసేపు ఆ వాయిస్‌ పర్సన్‌తో ఆడుకున్నాడు. ఆ తర్వాత ‘చిల్‌బ్రో.. ఫుల్‌ టు చిల్‌ బ్రో…’ అంటూ ఓ పాట వేస్తే అందరూ డ్యాన్స్‌ చేశారు. అఖిల్, మోనాల్‌ కలసి డ్యాన్స్‌ వేయడం కనిపించింది.

* అందరినీ లివింగ్‌ ఏరియాకు రమ్మని ఆ వాయిస్‌ చెప్పింది. రాని వాళ్లకు రన్నింగ్‌ కామెంట్రీ ఇస్తూ చిన్నపాటి ఫన్‌ సృష్టించింది ఆ వాయిస్‌. ఆ తర్వాత ఏవీలో వైల్డ్‌ కార్డు ఎంట్రీ అయిన అవినాష్‌ గురించి చూపించారు. జోకర్‌ జీవితంలో కష్టాల గురించి వివరించేలా ఆ ఏవీ సిద్ధం చేశారు. ఈ క్రమంలో అవినాష్‌ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, దాటి వచ్చిన బాధలు, కన్నీళ్లు ఆ ఏవీలో చూపించారు. ఆ తర్వాత అవీ ఇంట్లోకి ఇన్నర్‌ డోర్‌ నుంచి ఎంట్రీ ఇచ్చాడు.

* అఖిల్‌ – అభిజీత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తూనే ఉంది. వంట గదిలో సామాన్లు ఈ రోజు కుమార్‌సాయి, అఖిల్‌ తోమాలని కళ్యాణి సూచించింది. అభిజీత్‌కు పని ఎక్కువవుతోందని కళ్యాణి చెప్పింది. దానికి అఖిల్‌ ఆగకుండా… ఉదయం కూడా ఎక్కవే ఉంటోంది నువ్వు చూడటం లేదు అంటూ వాయిస్‌ పెంచాడు. దానికి అభిజీత్‌ ‘పని తక్కువని ఎవరూ అనడం లేదు… అందరూ అదే పని చేస్తున్నారు’ అంటూ కూల్‌ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అఖిల్‌ రియాక్షన్‌ అలా కనిపించ లేదు.

* మోనాల్‌కు పెద్ద ఫ్యామిలీ అంటే ఇష్టమనే విషయం తెలుసు కదా. ఆ పాయింట్‌ని పట్టుకొని వచ్చీ రాగానే అవినాష్‌ పులిహోర కలిపే పని మొదలుపెట్టాడు. మాది పెద్ద కుటుంబం అంటూ హింట్లు ఇచ్చాడు. దానికి మోనాల్‌ నవ్వుతోంది. అయినా అవినాష్‌ పులిహోర ఆపలేదు. నా చిన్నతనంలో ఓ గాళ్‌ఫ్రెండ్‌ ఉందని.. అమె నీలానే ఉండేది అంటూ పులిహోరలో పులుపు మోతాదు పెంచాడు. ఆఖరికి నువ్వే నా దేవత అంటూ డివోషనల్‌ సెంటిమెంట్‌ టచ్‌ కూడా ఇచ్చాడు.

* వంట గది దగ్గర అభిజీత్‌తో జరిగిన చర్చ గురించి మోనాల్‌తో అఖిల్‌ చెప్పాడు. నేను ఎంత పని చేసినా చేయడం లేదు అనేలా చిత్రిస్తున్నారు అంటూ బాధపడ్డాడు. అందుకే కెప్టెన్‌కి చెప్పి వంట గది డ్యూటీ నుంచి బయటపడిపోయాను అని కూడా చెప్పాడు. మనకైతే అఖిల్‌ చెప్పిన చర్చ చూపించలేదు. మరి అన్‌సీన్‌లో ఆ చర్చ చూపిస్తారేమో. మోనాల్‌ అయితే ఎవరి చెప్పినా వింటుంది కాబట్టి… ఇదీ వినేసి ఊరుకుంటుందా.. లేక ఎవరినైనా అడుగుతుందా చూడాలి.

* ఇంట్లో బెడ్‌ కింద ర్యాక్స్‌ను అమ్మ రాజశేఖర్‌, నోయల్‌ కలసి మార్చేశారు. బట్టలు, వస్తువులు పెట్టే ఆ ర్యాక్‌లను ఒకరివి బదులు మరొకరివి ఉంచారు. ఆ తర్వాత నోయల్‌ను బెడ్‌ వెనుక ఉంచి కళ్యాణిని భయపెట్టాలని చూశారు. కానీ లాస్య చేసిన తప్పు వల్ల వెనుక ఉన్న నోయల్‌ను కళ్యాణి చూసేసింది. అలా ఈ ప్లాన్‌ ఫ్లాప్‌ అయ్యింది. అయితే మరోసారి పకడ్బందీగా ప్లాన్‌ వేసి సుజాతను భయపెట్టారు. అయితే సుజాత నిజంగానే భయపడి ఏడ్చేసింది. అందరూ ఆమెను సముదాయించి మళ్లీ నవ్వించారు.

* ఈ రోజు టీమ్‌ మేట్స్‌ మరో ప్రాంక్‌ కూడా చేశారు. కొత్తగా వచ్చిన అవినాష్‌ను ఏడిపించాలని సిద్ధమయ్యారు. బెడ్‌ కింద ర్యాక్‌ లాగేసి అందులో టీషర్ట్‌ చూపించవా అని దేవీ వచ్చి అవినాష్‌ను అడిగింది. ర్యాక్‌ లాగిన అవినాష్‌ అందులో అమ్మాయిల దుస్తులు చూసి… షాక్‌ అయ్యాడు. దీంతో ఇంటిమొత్తం నవ్వేశారు. వచ్చిన తొలి రోజే అవినాష్‌ను ఓ ఆట ఆడుకున్నారు. ఆఖరికి బెట్‌ కాసి… అవినాష్‌తో లేడీ గెటప్‌ వేయించారు. లేడీ గెటప్ వేసుకున్న అవినాష్‌ తో గంగవ్వ స్పెషల్‌ ర్యాంప్‌ వాక్‌ చేసింది. ఆఖరున ఇచ్చిన ఫ్లయింగ్‌ కిస్‌, ఆ పోజు అయితే సూపరో సూపర్‌.

* లాస్య, అభిజీత్‌, హారిక, సుజాత మధ్య జరిగిన ట్రూత్ ఆర్‌ డేర్‌ గేమ్‌ గురించి మళ్లీ చర్చకొచ్చింది. అభిజీత్‌తో ఈ విషయం గురించి సుజాత మాట్లాడింది. ‘నువ్వు నాకు చెల్లెలు’ అంటూ అభిజీత్‌ అన్న మాటను సుజాత తప్పుగా తీసుకుంది. అనే మాట కరెక్ట్ అవ్వొచ్చు కానీ, అనే విధానం బాగాలేదు అని సుజాత బాధపడుతూ చెప్పింది. అభిజీత్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చి వెళ్లిపోయాడు.

* బీబీ టీవీలో ఈ రోజు ప్రోగ్రామ్‌గా ‘బీబీ కామెడీ షో’ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అవినాష్‌, కుమార్‌ను లీడర్లుగా బిగ్‌బాస్‌ రెండు టీమ్‌లు ఏర్పాటు చేశాడు. కళ్యాణి, అఖిల్‌, సుజాత, మోనాల్‌.. అవినాష్‌ టీమ్‌ సభ్యులుగా ఉంటారు. కుమార్‌ టీమ్‌లో అమ్మ రాజశేఖర్‌, దేవి, దివి, హారికను ఇచ్చాడు. ఈ రెండు టీమ్‌లు కామెడీతో ఎంటర్‌టైన్‌ చేసేలా స్కిట్లు చేయాలి. ఎవరి స్కిట్‌ నచ్చితే వారికి బెస్క్‌ స్కిట్‌ ఇవ్వమని మిగిలిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ సూచించాడు.

* రెండో వారం మొదలైనప్పటి నుంచి గంగవ్వ ఇంట్లో ఉంటానికి ఇబ్బంది పడుతోంది. ఈ రోజు చాలా ఇబ్బంది పడిపోయింది. ఒంట్లో బాగా నలతగా ఉండటంతో నీరసంగా అయిపోయి బెడ్‌ మీద వాలిపోయింది. పరిస్థితి గమనించిన బిగ్‌బాస్‌ గంగవ్వను కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిపించి మాట్లాడాడు. ఆరోగ్యం ఎలా ఉందో ఆరా తీశాడు బిగ్‌బాస్‌.. ‘‘నేను ఇంట్లో చాలా రోజులు ఉందామనే అనుకున్నా. నన్ను ఇక్కడ అందరూ బాగానే చూసుకుంటున్నారు కూడా. శరీరం సహకరించడం లేదు. ఇబ్బందిగా ఉంటోంది. సరైన విశ్రాంతి కూడా లేకపోవడంతో ఇంకా ఇబ్బంది అనిపిస్తోంది’’ అని చెప్పింది. దానికి బిగ్‌ బాస్‌ స్పందిస్తూ ‘‘మీ ఆరోగ్యం విషయంలో కంగారుపడకండి’’ అని చెప్పాడు. అయితే గంగవ్వ మాట్లాడుతూ ‘‘నేను ఇక్కడ ఇంకా ఉంటే ఇబ్బంది అవుతుందేమో. ఇక్కడ ఉంటే దుప్పటి కప్పుకొని ఉండటమే కదా. అదే మా ఇంటికి పోతే ప్రశాంతంగా ఉంటా ’’ అని తన బాధ చెప్పింది గంగవ్వ.

* ‘‘ఇంట్లో నన్ను మంచిగా భోజనం పెడుతున్నారు. బాగా చూసుకుంటున్నారు. అయినా ఇక్కడ ఉండటం నా తరం కావడం లేదు. ఓ తల్లీ తండ్రి చూసినట్లు నన్ను చూసుకుంటున్నారు. నా వాళ్లు ఎవరూ లేరు.. నాకు నీడ లేదని ఇక్కడికి వచ్చాను. కానీ ఉండలేకపోతున్నాను. మట్టిలో పెరిగిన శరీరం కదా.. ఇక్కడ ఏసీలు పడటం లేదు’’అని చెప్పింది. ‘మీరు గట్టి మనిషి… ఎన్నో కష్టాలు దాటి ఇక్కడికి వచ్చారు’ అంటూ బిగ్‌బాస్‌ ధైర్యం చెప్పి గంగవ్వను వైద్యుల పర్యవేక్షణకు పంపించారు. మరి గంగవ్వ అక్కడి నుంచి తిరిగి హౌస్‌లోకి వస్తుందా లేదా కొన్నాళ్లు పర్యవేక్షణలో ఉంటుందా అనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

2 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

2 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

8 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

43 seconds ago
Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

2 hours ago
Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

2 hours ago
Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

8 hours ago
Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version