బిగ్ బాస్ 4: నోయల్ వల్ల సేఫ్ అయిన అమ్మరాజశేఖర్

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. లాస్య, అమ్మరాజశేఖర్, అరియానా, అఖిల్, మెహబూబ్ ఇంకా మోనాల్. ఈ ఆరుగురిలో ఈసారి ఎవరూ కూడా ఎలిమినేట్ అవ్వట్లేదు అనే న్యూస్ తెలుస్తోంది. ఫిల్మీ ఫోకస్ కి ఎక్స్ క్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం నో ఎలిమినేషన్ అని నాగార్జున అందర్నీ సేఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, దీనికి బలమైన కారణం కూడా ఉందట.

ఈవారం అనూహ్యంగా హౌస్ లో నుంచి నోయల్ వెళ్లిపోయాడు కాబట్టి.., ఎలిమినేషన్ ని తీసేశారని అంటున్నారు. నిజానికి నోయల్ వెళ్లిపోకుండా ఉండి ఉంటే ఎలిమినేషన్ ప్రక్రియని చేసేవారు. అప్పుడు ఖచ్చితంగా అమ్మరాజశేఖర్ ఎలిమినేట్ అవుతారని చాలామంది ప్రిడిక్షన్స్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వివిధ ఓటింగ్ వెబ్ సైట్స్ లో అమ్మరాజశేఖర్ కి చాలా తక్కువ ఓట్లు కూడా వచ్చాయి. కాబట్టి అమ్మరాజశేఖర్ ఈవారం ఎలిమినేట్ అవుతారని చాలామంది గెస్ చేశారు. అయితే, ఈవారం ఎలిమినేషన్ అనేది లేదని పక్కా ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. నిజానికి లాస్ట్ వీక్ సమంత వచ్చినపుడు దసరా కాబట్టి ఎలిమినేషన్ జరగదని అనుకున్నారు.

అంతేకాదు, గత సీజన్ లో కూడా రమ్యకృష్ణ హోస్ట్ చేసిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అనేది జరగలేదు. అందుకే చాలామంది సమంత వచ్చినపుడు ఎలిమినేషన్ ఉండదనే అనుకున్నారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా 8వ వారం ఎలిమినేషన్ ని లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో నామినేషన్స్ లో ఉన్న హౌస్ మేట్స్ ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది. ఇప్పటికే అఖిల్ అండ్ లాస్య ఇద్దరూ కూడా సేఫ్ అయ్యారు. ఇక మిగతా వాళ్లు సండే ఎపిసోడ్ లో సేఫ్ అవుతున్నారన్నమాట. అదీ విషయం.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus