బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. రీసెంట్..గానే బిగ్‌బాస్ హౌస్‌లో అసలు సిసలు ఆట మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ మాటల యుద్ధాలు, కొట్లాటలతో దద్దరిల్లిపోయింది. టెనెంట్‌గా ఉన్నవారికి ఓనర్‌గా మారేందుకు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్, కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టింది. ఒక్క టాస్క్‌తో హౌస్‌మేట్స్ నిజ స్వరూపాలు బయటపడ్డాయి.బొమ్మలను కాపాడుకోవాల్సిన టాస్క్‌లో గొడవలు తారస్థాయికి చేరాయి. ఆటలో భాగంగా సుమన్ శెట్టి చేయి అనుకోకుండా ఫ్లోరాకు తగలడంతో, సంచాలక్..గా ఉన్న ప్రియ అతన్ని వెంటనే ఎలిమినేట్ చేసింది.
అయితే, ఆ తర్వాత రీతూ చౌదరి ఏకంగా సంజనను తోసేసినా, ప్రియ మాత్రం చూసీచూడనట్లు వదిలేసింది. దీంతో ఇంట్లో పక్షపాతంపై పెద్ద దుమారమే రేగింది. ‘సుమన్‌ను ఔట్ చేశారు, రీతూని ఎందుకు చేయరు?’ అంటూ సంజన గట్టిగా నిలదీయడంతో వాతావరణం వేడెక్కింది. ఆటలో గెలవడం కోసం రీతూ చౌదరి అడ్డదారులు తొక్కింది. తన కోసం ఆడుతున్న రాము బాస్కెట్‌లోని బొమ్మలన్నింటినీ లాక్కొని తన బాక్సులో వేసేసుకుంది. ఇది చూసిన ఇమ్మాన్యుయేల్ ‘పాపం వాడు నీకోసం ఆడుతుంటే వాడి బొమ్మలే తీసేస్తావా?’ అని ప్రశ్నించాడు.
దీనికి రీతూ పొగరుగా ‘నా గేమ్ నాకు తెలుసు, నువ్వొచ్చి రేలంగి మావయ్యలా నీతులు చెప్పకు’ అంటూ ఎగతాళి చేసింది.ఆ మాటలకు ఏమాత్రం తగ్గని ఇమ్మాన్యుయేల్, ‘నేను నీకు మావయ్యలా కనిపిస్తున్నానో లేదో కానీ, నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు మాత్రం కచ్చితంగా రేలంగి అత్తయ్యవే’ అంటూ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. ఈ డైలాగ్‌తో హౌస్‌లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.చివరకు ఎన్నో గొడవల మధ్య, రీతూ కోసం త్యాగం చేసిన రామునే టెనెంట్స్ అంతా కలిసి ఓనర్‌గా ఇంట్లోకి పంపారు.అలా నిన్నటి ఎపిసోడ్ మొత్తం రీతూ అగ్రెసివ్ గేమ్‌ప్లే, ఇమ్మూ అదిరిపోయే కౌంటర్‌తో హైలైట్‌గా నిలిచింది.