Jr NTR: తారక్ షోలో చేయాల్సిన మార్పు ఇదేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానులు భారీస్థాయిలో ఉన్నారు. ఈ తరం నటులలో పౌరాణిక పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే నటుడిగా తారక్ కు పేరుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర హోస్ట్ గా తారక్ మెప్పిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పోలికలు ఉండటం కూడా తారక్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నాలుగు వారాలుగా ఈ షో టీవీలో ప్రసారమవుతుండగా ఎన్టీఆర్ హోస్ట్ గా పర్ఫెక్ట్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తొలివారం భారీగా రేటింగ్స్ రాకపోయినా రెండో వారం, మూడో వారం ఈ షో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ షోకు వచ్చిన కంటెస్టెంట్లలో కొంతమంది కంటెస్టెంట్లు ఎన్టీఆర్ పై ఊహించని స్థాయిలో అభిమానం కనబరుస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులకు ఇది నచ్చుతున్నా న్యూట్రల్ ఆడియన్స్ కు మాత్రం నచ్చడం లేదు. కొంతమంది కంటెస్టెంట్లు ఎన్టీఆర్ కు ఎక్కువగా భజన చేయడం షోకు మైనస్ అవుతోంది. షో నిర్వాహకులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

జెమినీ ఛానల్ నిర్వాహకులు ఎడిటింగ్ లోనైనా షోకు మైనస్ అయ్యే విషయాలను కట్ చేస్తే మంచిది. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో కలెక్షన్ల రికార్డులను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus