18మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ 24 x 7 లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభం అయినపుడు ఎన్నో విమర్శలు వినిపించాయి. అసలు ఇన్ని గంటలు ఈ షోని ఎవరు చూస్తారు అని చాలామంది కామెంట్స్ చేశారు. మెల్ల మెల్లగా 24గంటల కంటెంట్ లో హైలెట్స్ ని చూడటం ప్రారంభించారు. హౌస్ లో తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ బిగ్ బాస్ టాప్ – 7లో ఒకరిగా నిలిచింది బిందుమాధవి. ఆ తర్వాత పార్టిసిపెంట్స్ గేమ్ కి అలవాడు పడ్డారు ఆడియన్స్. ఇక అక్కడ్నుంచీ బిందు మాధవి – అఖిల్ మద్యలో నామినేషన్స్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూడటం స్టార్ట్ చేశారు. బిందు మాధవి రెండో వారం నుంచీ అఖిల్ తో గట్టిగా గేమ్ ఆడింది. సై అంటే సై అంటూ లాజిక్స్ వెతుకుతూ నామినేషన్స్ లో తన పవర్ ని చూపించింది.
ఒక వయసు వచ్చిన తర్వాత చాలామంది ఎన్నో మాటలు అంటుంటారని, ఇంకా ఎన్నాళ్లు ప్రయత్నిస్తావ్ అంటూ మాటలు విసురుతారని, అవన్నీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా విజయం వస్తుందని చెప్పింది. అందుకు నేను ఉదాహరణ అని, తెలుగులో అవకాశాలు లేనపుడు, తమిళ బిగ్ బాస్ పార్టిసిపేట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు తెలుగు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదని, ఇప్పుడు ఈ ట్రోఫీ తీస్కోవడం చాలా గర్వంగా ఉందని చెప్పింది బిందు. బిందు స్పీచ్ కి ఆడియన్స్ తో పాటుగా, హౌస్ మేట్స్ , ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫిదా అయిపోయారు. హౌస్ట్ నాగార్జున కూడా బిందు టైటిల్ గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఫస్ట్ టైమ్ తెలుగు సీజన్ లో ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. అంతేకాదు, బిగ్ బాస్ మేనేజ్మెంట్ సైతం బిందుకి అభినందనలు తెలిపింది.
బిందు మాధవికి సంబంధించి ఎవ్వరూ చూడని కొన్ని ఫోటోలను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి: