నటిగా తెలుగులో పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన నటి బిందు మాధవి అనంతరం తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈమె తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లారు. ఇక తమిళంలో కూడా ఈమెకు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇలా సినిమాల ద్వారా గుర్తింపు లేకపోయినప్పటికీ బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా తమిళంలో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె తెలుగులో ప్రసారమైన నాన్ స్టాప్ కార్యక్రమంలో కూడా పాల్గొని సందడి చేశారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకొని చివరికి విజేతగా నిలిచిన బిందు మాధవి తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా మహిళా విజేతగా పేరు సంపాదించారు. ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమెకు విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు. ఇక బిగ్ బాస్ అనంతరం ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.
అయితే తాజాగా ఒక నెటిజన్ నుంచి బిందు మాధవికి చేదు అనుభవం ఎదురయింది.ఈ సందర్భంగా సదరు నెటిజన్ స్పందిస్తూ బిగ్ బాస్ కార్యక్రమంలో బిందు మాధవి ఉన్నప్పుడు తనపై చాలా గౌరవం ఉండేదని కామెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర కంటెస్టెంట్లు అందరూ బాడీ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నప్పటికీ బిందు మాధవి మాత్రం ఎంతో చక్కగా, పద్ధతిగా దుస్తులు ధరించడంతో తనపై చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు తనపై ఉన్న ఆ గౌరవం పోయింది అంటూ నేటిజన్ కామెంట్ చేశారు.
ఇక ఇది చూసిన బిందు మాధవి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం తను వేసుకునే దుస్తులు బట్టి ఉంటుందంటే అలాంటి గౌరవం నాకొద్దు అంటూ బిందు మాధవి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఇది చూసిన నెటిజన్లు బిందు మాధవికి మద్దతు తెలుపుతూ వస్త్రధారణ బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వం అంచనా వేయకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.