క్రేజీస్టార్ విశాల్‌ను పార్టీలోకి వచ్చేలా చేసేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తమిళ సినీవర్గాల సమాచారం. ప్రస్తుతం నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్‌ను బీజేపీలో చేరేందుకు ఒప్పించే బాధ్యతలను చెన్నై నివాసి, మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే పార్టీ నేత మురళీధరరావుతో భేటీ అయి చర్చలు జరిపిన శ్రీకాంత్, ఆపై విశాల్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. మైలాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి విశాల్ ను పోటీకి దించుతామన్న ఆఫర్ ను కూడా ఇచ్చినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతానికి తాను నడిగర సంఘం భవన నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నానని విశాల్ చెప్పినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.