Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Advertisement

చాలా కాలం తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా రూపొందిన చిత్రం ‘బ్లాస్ట్ జోన్'(Blast Zone). అభిరామి అర్జున్ కి జోడీగా నటించగా.. యంగ్ హీరోయిన్ ప్రీతీ ముకుందన్ అత్యంత కీలక పాత్రలో నటించింది. నిన్న అంటే మే 29న చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమా.

Blast Zone

లోకేష్ కనగరాజ్, నెల్సన్ వంటి తమిళ స్టార్ దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన సుభాష్ కె రాజ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి షో నుండే సినిమాకి సూపర్ రెస్పాన్స్ లభించింది.

చాలా కాలం తర్వాత అర్జున్ కి సరైన సినిమా పడిందని ఆయన ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘సితార’ నాగవంశీ రిలీజ్ చేశారు. అయితే ప్రమోషన్ పెద్దగా లేకపోవడంతో ‘బ్లాస్ట్ జోన్’ కి మొదటి రోజు అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.11 cr
సీడెడ్ 0.02 cr
ఆంధ్ర(టోటల్) 0.06 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 0.19 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.02 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.21 cr(షేర్)

‘బ్లాస్ట్ జోన్’ సినిమా(తెలుగు వెర్షన్)  రూ.1.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.21 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.36 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.79 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus