సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇదొక అడ్వెంచర్ డ్రామా. మైథలాజి టచ్ కూడా ఉంటుందని టాక్ వచ్చింది. ప్రియాంక చోప్రా (Priyanka Chopra) , పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో వంటివి కూడా మొన్నామధ్య సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత షూటింగ్ కు కొంత గ్యాప్ దొరకడంతో మహేష్ బాబు ఫ్యామిలీతో విదేశాలకి టూర్ కి వెళ్ళొచ్చాడు. ఇక తర్వాతి షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది అని సమాచారం. దానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అదేంటంటే.. మహేష్- రాజమౌళి సినిమాకు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్లో బోట్ యాక్షన్ సీక్వెన్సులు తీస్తారట. ఇవి కూడా హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేసినట్లు వినికిడి. దాదాపు 3000 మంది కాస్ట్ అండ్ క్రూ ఈ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం.
ఈ యాక్షన్ ఎపిసోడ్ ను దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో చిత్రీకరించబోతున్నారు అని సమాచారం. సినిమాలో (SSMB29) దాదాపు 12 నిమిషాల పాటు ఈ ఎపిసోడ్ ఉంటుందట. అది ప్రస్తుతం రాజమౌళి అనుకుంటుంది. అయితే ఫైనల్ కాపీ రెడీ అయ్యే టైంకి ఎంత నిడివి ఉంటుంది అనేది తర్వాత సంగతి. ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్ ను 2 వారాల పాటు చిత్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 28 నుండి నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.