హెబ్బా పటేల్ (Hebah Patel) , వశిష్ట ఎన్ సింహా (Vasishta N. Simha) ప్రధాన పాత్రల్లో ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) అనే సినిమా తెరకెక్కింది. అశోక్ తేజ (Ashok Teja) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సాయి రోనాక్(Sai Ronak), పూజిత పొన్నాడ (Poojita Ponnada) కూడా కీలక పాత్రలు పోషించారు. పెద్దగా చప్పుడు లేకుండా 2022 ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేరుగా ఆహా ఓటీటీలో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అయినప్పటికీ ఆడియన్స్ బాగానే చూశారు. మంచి వ్యూయర్షిప్ నమోదైంది. దీంతో దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు.
అయితే సీక్వెల్ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే దీన్ని సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా మలిచినట్లు టీజర్ ద్వారా స్పష్టంచేశారు. ఒకరకంగా అది అందరినీ సర్పైజ్ చేసింది అనే చెప్పాలి. తమన్నా ఈ సీక్వెల్ లో మెయిన్ రోల్ చేస్తుండటం వల్ల… వీటికి బిజినెస్ వంటివి కూడా బాగా జరిగింది. ఆల్రెడీ ‘ఓదెల 2’ ని కొంతమంది టాలీవుడ్ పెద్దలకి స్పెషల్ షో వేసి చూపించారు. అనంతరం వారు తమ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది.
వారి టాక్ ప్రకారం.. ‘ఓదెల 2’ (Odela 2) రన్ టైం 2 గంటల 30 నిమిషాలు ఉంటుందట. సినిమాలో గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేసినట్టు తెలుస్తుంది. అలాగే గ్లామర్ డోస్ కూడా గట్టిగానే దట్టించారట. అయితే మరీ ఫస్ట్ పార్ట్ రేంజ్లో కాదు అని చెబుతున్నారు. రాధ చేతిలో మృతి చెందిన తిరుపతి ప్రేతాత్మ అయ్యి.. ఆమెపై అలాగే ఊరి జనాలపై పగ తీర్చుకోవడానికి తిరిగి రావడం…
ఈ క్రమంలో ఆవహించి అతను చేసే వికృత చర్యలు ‘అరుంధతి’ లో పశుపతిని గుర్తుచేస్తాయని అంటున్నారు. అయితే శివ శక్తిగా తమన్నా (Tamannaah Bhatia) ఎంట్రీ, ఆమెకు వసిష్ఠ సింహా కి మధ్యలో వచ్చే సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అంటున్నారు. అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు కొన్ని మైథలాజికల్ అంశాలు కూడా అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని సినిమా చూసిన వారు చెబుతున్నారు. మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.