Sarangapani Jathakam Trailer Review: ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా…!

ప్రియదర్శి (Priyadarshi) ,రూప కొడువాయూర్ (Roopa Kodayur)  జంటగా నటించిన సినిమా ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam). ఇంద్రగంటి మోహనకృష్ణ (Mohana Krishna Indraganti) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) నిర్మిస్తున్నారు. వాస్తవానికి డిసెంబర్ 20 ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగించుకుని ఏప్రిల్ 25న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్, పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.

Sarangapani Jathakam Trailer Review:

ఈరోజుల్లో జాతకాల పిచ్చి ఉన్న ఓ హీరో ప్రతిరోజూ ఉదయం పేపర్లో తన రాశి గురించి ఏం ఉందో తెలుసుకోకుండా రోజుని ప్రారంభించడు. ఈ క్రమంలో జాతకరీత్యా అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? సీనియర్ నరేష్ (Naresh) ,తనికెళ్ళ భరణి (Tanikella Bharani)..ల పాత్రల వల్ల అతను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు? వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ కట్ చేశారు. తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు. 2 నిమిషాల 14 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్లో హీరో, హీరోల లవ్, రొమాంటిక్ యాంగిల్ తో మొదలైంది.

తర్వాత హీరోయిన్ పాత్రలో ఏదో సస్పెన్స్ ఉన్నట్టు ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేశారు. నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ… హీరో ఎందుకు హీరోయిన్ ని అవాయిడ్ చేస్తున్నాడు? వంటి ప్రశ్నలని కూడా లేవనెత్తింది ట్రైలర్. అయితే హీరో జాతకంలో ఉన్న సమస్య గురించి ఈ ట్రైలర్లో కూడా ఎటువంటి హింట్ ఇవ్వలేదు. కానీ ప్రియదర్శి,  అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) , ‘వెన్నెల’ కిశోర్ (Vennela Kishore) , హర్ష చెముడు (Harsha Chemudu) వంటి వాళ్ళ కామెడీ సినిమాలో హైలెట్ అయ్యేలా ఉంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus