వెంకటేష్, నాగ చైతన్య కలయికలో మల్టీ స్టారర్ మూవీ

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది మల్టీ స్టారర్ మూవీల జోరు కొనసాగుతోంది. యువ హీరోలు కలిసి నటించడంతో పాటు.. సీనియర్ హీరోలు యువ హీరోలతో కలిసి నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అదే విధంగా ఒకే కుటుంబానికి చెందిన హీరోలు కలిసి నటించటానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ కథలు సెట్ కాక, కథ నచ్చినా డీల్ చేసే డైరక్టర్స్ లేక ప్రాజక్ట్స్ ఆగిపోతున్నాయి. ఇలా సురేష్ బాబు తన కుటుంబ హీరోలతో సినిమాలు చేయాలనీ ప్రయత్నించి అనేక సార్లు విఫలమయ్యారు. అయితే ఇప్పుడు మాత్రం సక్సస్ అయినట్లు తెలిసింది. విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్యలతో సినిమా చేయడానికి సోగ్గాడే చిన్ని నాయన , రారండోయ్ వేడుక చూద్దాం ఫేం కళ్యాణ్ కృష్ణ ముందు ఒకే చెప్పారు.

ప్రస్తుతం రవితేజతో చేస్తున్న నేల టికెట్ షూటింగ్ పూర్తి కాగానే ఈ ప్రాజక్ట్ మొదలు పెడతానని చెప్పారు. అయితే నేల టికెట్ పూర్తి కావడానికి మరో ఐదు నెలల సమయం అవసరమని తెలిసి మల్టీ స్టారర్ మూవీని వదిలేశారు. అతను తప్పుకున్న తర్వాత ఈ కథకి డైరక్టర్ బాబీ కనెక్ట్ అయినట్లు తెలిసింది. జై లవకుశ తర్వాత నాగ చైతన్యతో సినిమా చేయాలనీ తిరుగుతున్న బాబీ కి సురేష్ బాబు ఈ స్టోరీ అప్పగించినట్లు టాక్. డైరక్టర్ సంతకాలు చేయగానే అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus