Rashmika: రష్మిక పేరుతో మోసం.. బయటపడ్డ బాలీవుడ్ నటీనటుల బండారం..!

  • January 24, 2023 / 06:34 PM IST

సినిమాల్లోకి రావాలని.. కెమెరా ముందు కనిపించి పాపులర్ అయిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు. ఇది ఒక రంగుల ప్రపంచం. అందుకే దీనికి ఆకర్షితులయ్యేవారి సంఖ్య ఎక్కువ. అందుకే ఇండస్ట్రీలో చిన్న చితకా పనులు చేసుకునేవారు కూడా .. సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునేవారిని మోసం చేస్తూ ఉంటారు. వాళ్లకు పెద్ద అమౌంట్ దక్కింది అంటే చాలు వెంటనే మకాం మార్చేస్తారు. అందుకే ‘ఇలాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయి.. కానీ ఇదే మొదటిసారి’ అన్నట్టు కొత్తగా మోసపోయిన వారి గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం .

తాజాగా రష్మిక పేరు చెప్పి ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్ రూ.20 లక్షలకు టోకరా పెట్టారు. వివరాల్లోకి వెళితే.. పాన్ ఇండియా వైడ్ క్రేజ్ ను సంపాదించుకున్న రష్మిక… నేషనల్ క్రష్ అనే ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈమెకు మంచి క్రేజ్ నెలకొంది. అక్కడ రెండు సినిమాలు చేసిన రష్మిక.. అవి సక్సెస్ కాకపోయినా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇక అసలు విషయానికి వస్తే..

“చిన్నపిల్లలకు మోడలింగ్ లో ట్రైనింగ్ ఇచ్చి, సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు ఇద్దరు బాలీవుడ్ నటులు. ఈ విషయాన్ని పసిగట్టిన.. సైబరాబాద్ పోలీసులు .. వారిద్దరినీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి పేర్లు అపూర్ అశ్విన్, నటాషా కపూర్ గా పోలీసులు గుర్తించారు.అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ర్యాంప్ షోలు నిర్వహిస్తామని కూడా చెప్పి వీళ్ళు మోసాలకు పాల్పడుతున్నారట. కాస్మోపాలిటన్ మోడల్ పేరుతో ఓ వెబ్ సైట్ కూడా రన్ చేస్తున్నారు.

ఓ బడా వ్యాపారవేత్తను సైతం వీళ్ళు మోసం చేయడం హాట్ టాపిక్ గా నిలిచింది. రష్మిక సినిమాలో రోల్ ఇప్పిస్తామని చెప్పి ఆ వ్యాపారవేత్త నుండి రూ.20 లక్షలకు పైగా వసూల్ చేశారట. రోజులు గడుస్తున్నా అపూర్ అశ్విన్, నటాషా కపూర్ ల నుండి ఫోన్ రాకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వినికిడి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus