తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోని బాలీవుడ్ హీరోయిన్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇతర భాషా నటీమణులకు మంచి ఆహ్వానం లభిస్తుంది. మలయాళం, తమిళం, కన్నడ, హిందీ వారు తెలుగులో సినిమాలు చేసి తెలుగు ఆడపడుచులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొంతమంది బాలీవుడ్ బ్యూటీలు ఎంతకష్టపడ్డా తెలుగువారిని మెప్పించలేకపోయారు. వారిలో కొంతమంది పై ఫోకస్..

1. ప్రియాంక చోప్రా (తుఫాన్ ) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన హిందీ మూవీ జంజీర్. ఇది తెలుగులో తుఫాన్ గా రిలీజ్ అయింది. అయితే చరణ్ సరసన నటించిన బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలుగు వారి మదిలోకి చేరలేకపోయింది.

2. బిపాష బసు (టక్కరిదొంగ)మహేష్ బాబు టక్కరి దొంగ సినిమాలో హీరోయిన్ గా బిపాష బసు నటించింది. ఆమె నటించినట్టు కూడా తెలుగు ప్రేక్షకులు మరిచిపోయారు.

3. కంగనా రనౌత్ (ఏక్ నిరంజన్ )బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెలుగులో ప్రభాస్ పక్కన ఏక్ నిరంజన్ సినిమాలో నటించింది. ఆమెపై పూరి జగన్నాథ్ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేసింది. నటనతో మెప్పించలేకపోయింది.

4. ట్వింకిల్ ఖన్నా (శీను)శీను సినిమాలో ట్వింకిల్ ఖన్నా వెంకటేష్ ప్రియురాలిగా నటించారు. ఈ మూవీ విజయం సాధించినప్పటికీ ట్వింకిల్ ఖన్నా తెలుగువారికి దగ్గరకాలేకపోయారు.

5. అమృత రావు (అతిథి)బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ అమృత రావు అతిథి సినిమాలో మహేష్ బాబు సినిమాలో నటించింది. అయినా తెలుగు ఆడియన్స్ మనసు దోచుకోలేకపోయింది.

6. మనీషా కొయిరాలా మనీషా కొయిరాలాకి ఇతర భాషల్లో అనేక హిట్స్ ఉన్నాయి. ఆమె నాగార్జున తో క్రిమినల్ మూవీ చేసారు. ఆ మూవీ హిట్ అయినా మనీషా కి తెలుగులు ఛాన్స్ లు రాలేదు.

7. అయేషా టకియా నాగార్జున సూపర్ మూవీ లో అయేషా టకియా ని పూరి పరిచయం చేశారు. ఈ పాల బుగ్గల సుందరి ఎంత స్కిన్ షో చేసినా టాలీవుడ్ లో సక్సస్ అందుకోలేకపోయింది.

8. షమితా శెట్టి (పిలిస్తే పలుకుతా)శిల్పా శెట్టి తెలుగులో మంచి హిట్స్ అందుకుంది. ఆమీ చెల్లెలు షమితా శెట్టి పిలిస్తే పలుకుతా లో నటించింది. అయినా అక్కలాగా నటనలో మంచి మార్కులు పొందలేకపోయింది.

వీళ్ళతో పాటు కొంతమంది బాలీవుడ్ తారలు టాలీవుడ్ లో రాణించలేకపోయారు. ఒక్క సినిమాతోనే వెనుతిరిగారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus