ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పేరు కూడా పెట్టేశారు. అనౌన్స్‌మెంట్ అవ్వడానికి ముందు, ఇప్పుడు.. ఇలా ఎప్పుడూ సినిమా చుట్టూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. సినిమా కూడా ఆగుతూ ఆగుతూ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హోల్డ్‌లో ఉంది. దానికి కారణం తారక్ గాయపడటమే. ఆ విషయం పక్కన పెడితే ఏదో ఒక రూపంలో సినిమా గురించి చర్చ అయితే జరుగుతూనే ఉంది.
తాజా చర్చ ఏంటంటే.. సినిమాలో కనిపించబోయే బాలీవుడ్ నటులు ఎవరు? ఈ సినిమాలో రెండు కీలక పాత్రలు ఉన్నాయని.. వాటి కోసం ఇద్దరు బాలీవుడ్ నటులను తీసుకునే ఉద్దేశంలో చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది పేర్లు వినిపిస్తున్నా.. అందులో ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్, ప్రముఖ కథానాయిక ఆలియా భట్ పేర్లు స్టేబుల్ అయ్యాయి. ఈ ఇద్దరూ ఈ సినిమాలో నటించడం పక్కా అని చెబుతున్నారు.
అయితే, ఈ రెండు పాత్రలు ప్రాధాన్యత అంతగా ఉండదని.. కానీ సినిమాలో కీలక సమయంలో వచ్చి.. కథను మలుపు తిప్పుతారని చెబుతున్నారు. ఇది ఒక వెర్షన్ అయితే.. మరో వెర్షన్ ప్రకారం అయితే ఈ సినిమాకు బాలీవుడ్‌లో బజ్ క్రియేట్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు అని చెబుతున్నారు. సినిమాకు తొలుత మంచి హైపే ఉన్నా.. సినిమా టీజర్‌కి వచ్చిన బ్యాక్ లాష్ మొత్తం దెబ్బ తీసింది. ఎన్టీఆర్ వాయిస్, లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్ మీద విమర్శలు వచ్చాయి.
సినిమా షూటింగ్‌ను త్వరలో రీస్టార్ట్ చేస్తారని.. ఇటీవల చెప్పినట్లుగా సినిమాను జూన్ 11న విడుదల చేస్తారని సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది. ఎందుకంటే టీజర్‌లో చూపించిన ప్రధాన పాత్రలు/ ప్రాంతాల మొత్తం కథ తొలి భాగంలో చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సినిమా రెండు భాగాలుగా రావడం పక్కా అని చెప్పొచ్చు.