Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Advertisement

సినిమాల్లో స్కిన్‌ షో, తక్కువ దుస్తులు లాంటివి ఇప్పటివి కావు. ఎన్నో ఏళ్లుగా ఇండియన్‌ సినిమాల్లో చూస్తూ వచ్చాం. తొలినాళ్లలో బాలీవుడ్‌లో మొదలైన ఈ ‘షో’ ఇప్పుడు ఇతర భాషలకు కూడా వ్యాపించింది. ఒక సమయంలో బాలీవుడ్‌లో బి గ్రేడ్‌ సినిమాలకు బీభత్సమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. అలాంటి సినిమాల్లో కొంతమంది స్టార్‌ హీరోయిన్లు తొలినాళ్లలో నటించారు. ఇప్పుడైతే నేరుగా హీరోయిన్లు స్కిన్‌ షో చేసేస్తున్నారు. ఈ మేరకు డోస్‌ ఎక్కువైంది అనే విమర్శలు కూడా బాలీవుడ్‌ మీద వచ్చాయి.

Peddi Movie

‘పెద్ది’ (Peddi) సినిమా విడుదలైన తర్వాత హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ పాత్ర ఇండస్ట్రీలో చర్చనీయాంశమైపోయింది. జాన్వీ పాత్ర చూపించిన విధానంపై చిన్న స్థాయి వివాదం నెలకొంది. జాన్వీని సినిమాలో అలా చూపించడం, డ్రెస్సింగ్‌ సెన్స్‌, డైలాగ్‌ల గురించి విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సానా మీద కూడా విమర్శలు వచ్చాయి. దాంతో ఆయన ఈ విషయంలో స్పందించి సారీ చెప్పి ఆ సీన్స్‌ కూడా డిలీట్‌ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ వివాదంపై సీనియర్‌ నటి జయా బచ్చన్ స్పందించారు.

సినిమాల్లో మహిళలను గ్లామర్‌ పాత్రల వరకే చూడడాన్ని జయా బచ్చన్‌ తీవ్రంగా ఖండించారు. సెట్‌లోనే ఇలాంటి విషయాలను వెంటనే అడ్డుకోవాలని సూచించారు. అంతా జరిగిన తర్వాత ఇప్పుడు మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ తన కెరీర్‌లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ‘షోర్’ సినిమా షూటింగ్‌లో దర్శకుడు తనను ఒక సీన్ కోసం గాగ్రా చోళీ లాంటి డ్రెస్‌ వేసుకోవాలని కోరారట.

ఆ డ్రెస్‌ వేసుకోవాలంటే కచ్చితంగా చున్నీ ఉండాలని అడిగారట జయా బచ్చన్‌. ఆ సమయంలో ఆమెకు, దర్శకుడిక మధ్య పెద్ద గొడవ జరిగిందట. ఆ తర్వాత సెట్‌లో ఎవరూ అలా ప్రవర్తించే ధైర్యం చేయలేదు అని చెప్పారు జయా బచ్చన్‌. మరోవైపు ఈ కామెంట్స్‌కు కరీనా కపూర్‌ మద్దతు ఇచ్చారు. తెరపై రొమాన్స్‌ పండటానికి, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అలాంటి దుస్తులు వేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అయితే ‘గెహ్రాహియా’ లాంటి సినిమాలో డ్రెస్సింగ్‌ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. అప్పుడు బాలీవుడ్‌ మాజీలు ఏమీ అనలేదు. దీంతో ఇప్పుడు ‘పెద్ది’ని టార్గెట్‌ చేస్తున్నారా అనే మాట వినిపిస్తోంది.

జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus