సౌత్‌పై మనసవుతోంది అంటున్న బాలీవుడ్ నటి!

ఇది ఇప్పటి మాట కాదు కానీ.. ఓ రెండు, మూడేళ్ల క్రితం నాటి మాట. టాలీవుడ్‌లో ఓ స్టార్‌ హీరో సినిమా మొదలవుతోంది, అందులో బాలీవుడ్‌ నాయికను తీసుకుంటారు అనే మాట బయటకు రావడం ఆలస్యం. ‘ఈ సినిమాలో పరిణీతి చోప్రా పేరును పరిశీలిస్తున్నారు!’ అనే మాట బయటకొచ్చేది. అంతలా పరిణీతి కోసం టాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేశారు. అయితే అవేవీ వర్కవుట్‌ కాలేదు.. ఆమె టాలీవుడ్‌కి రాలేదనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు సౌత్‌ సినిమాల మీద మనసవుతోంది అని చెబుతోంది పరిణీతి.

‘దక్షిణాది సినిమాల్లో నటించాలని నేను ఎంతగా తహతహలాడుతున్నానో మాటల్లో వర్ణించలేను అంటోంది పరిణీతి చోప్రా. దిల్లీలో ఇటీవల నిర్వహించిన అజెండా ఆజ్‌తక్‌ 2022 అనే కార్యక్రమంలో పరిణీతి మాట్లాడింది. ఈ క్రమంలోనే ‘‘నేను దక్షిణాది సినిమాల్లో నటించడానికి చాలా ఆసక్తి ఉన్నాను. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ.. ఇలా ఏ భాష అయినా ఫర్వాలేదు. ఒక మంచి సినిమాలో నటించాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నా’’ అని చెప్పింది పరిణీతి చోప్రా.

‘‘ఒక మంచి దర్శకుడు, సరైన స్క్రిప్ట్‌ కలిస్తే అద్భుతమైన ప్రాజెక్టు బయటికొస్తుంది. అలాంటి అవకాశమే నాకు దక్కాలి. దయచేసి మీలో ఎవరికైనా ఒక గొప్ప దర్శకుడి గురించి తెలిస్తే నాకు చెప్పండి. వెంటనే సినిమా ఓకే చేసుకుని చేసేస్తా’’ అని చెప్పింది పరిణీతి. పరిణీతి ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌కి జోడీగా ‘క్యాప్సూల్‌ గిల్‌’ అనే సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

అయితే ఇక్కడే ఓ విషయాన్ని గమనించాలి. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా జోరు మీదున్న సమయంలో తెలుగు నుండి కొన్ని సినిమా టీమ్స్‌ ఆమెను కాంటాక్ట్‌ అయ్యాయి అంటారు. అయితే అప్పుడు పరిణీతి నో చెప్పింది అని అంటారు. అయితే అప్పుడెందుకు నో చెప్పింది, అసలు నో చెప్పిందా అనేది తెలియలేదు. కానీ ఇప్పుడు సౌత్‌కి వస్తా అంటున్న పరిణీతిని.. నెటిజన్లు మాత్రం అప్పుడు పిలిస్తే రాలేదు, ఇప్పుడు వస్తా అంటావా అని అంటున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus