బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ సినిమా టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది. బెల్లంకొండకి తొలిసారి వచ్చిన జెన్యూన్ హిట్ ఇది. ఈ సినిమా తరువాత అతడికి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నటుడు హవీష్ తన సొంత బ్యానర్ పై నిర్మించారు. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్నాడు హవీష్. కానీ కోవిడ్ కారణంగా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమాను హిందీ రీమేక్ రైట్స్ ను అక్షయ్ కుమార్ కి అమ్మేసినట్లు తెలుస్తోంది.
హవీష్ నిర్మించాలన్న ఈ సినిమాకి ఇప్పుడు అక్షయ్ కుమార్ నిర్మాత. అంతేకాదు.. ఈ సినిమాలో ఆయనే లీడ్ రోల్ పోషించబోతున్నారు. హవీష్ కు అక్షయ్ మంచి డీల్ ఇవ్వడంతో ఆయన వెంటనే రైట్స్ ను అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు అక్షయ్. పేరున్న బాలీవుడ్ డైరెక్టర్ దీన్ని రూపొందించబోతున్నారు. అలానే ఫేమస్ యాక్టర్ విలన్ రోల్ లో కనిపిస్తారని టాక్.
మరి హిందీలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం అక్షయ్ నటించిన ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలానే మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.