ముగ్గురు హీరోల మల్టీస్టారర్… ఈ సౌండే చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ. ఇలాంటి ఓ సినిమా రావాల్సింది ఆగిపోయింది అనే విషయం తెలుసా? ఆదివారం ఉదయం నుండి సోషల్ మీడియాలో ఇదే చర్చ. నిజానికి ఈ చర్చ మొదలైంది బొమ్మరిల్లు భాస్కర్ నుంచే. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రచారంలో భాగంగా భాస్కర్ మాట్లాడుతూ… ‘ఒంగోలు గిత్త’ తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చిందో చెప్పాడు. అప్పుడు ముగ్గురు హీరోల మల్టీస్టారర్ అని అన్నాడు. దీంతో ఏంటా సినిమా అని వెతికేస్తున్నారు.
ఈ సినిమా ఏంటై ఉండొచ్చు అని గూగుల్‌లో వెతుకుతుంటే అసలు సమాచారం బయటికొచ్చింది. భాస్కర్ చేస్తామనుకున్న సినిమా దిల్ రాజు బ్యానర్‌లో అట. దీని బట్టి చిన్న క్లారిటీ వచ్చుండాలి. లేకపోతే మేమే చెబుతాం. గూగుల్‌లో పాత సమాచారం ప్రకారం చూస్తే… ఆ సినిమా ‘బెంగుళూరు నాటకల్’ రీమేక్. తమిళంలో రానా, బాబీ సింహా చేసిన సినిమా అది. మలయాళంలో అయితే ‘బెంగుళూరు డేస్’ పేరుతో దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్, నివిన్ పౌలి చేశారు.
ఆ సినిమాను తెలుగులో నాగచైతన్య, ఎన్టీఆర్… మరో హీరోత చేద్దాం అనుకున్నారు దిల్ రాజు. దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ అనుకున్నారు. ఈ కథ మీద భాస్కర్ కొన్ని రోజులు వర్క్ కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా ఊసు వినిపించలేదు. దీంతో ఈ వార్త పుకారుగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు భాస్కర్ మళ్లీ ఆ విషయం బయటకు తీశాడు. అయితే అప్పుడు డేట్లు కుదరక అగిపోయింది ఆ సినిమా అని చెప్పాడు. చేసుంటే ఎలా ఉండేదో కదా.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!