సాయిపల్లవిని డామినేట్ చేయనున్న భూమిక!

ఖుషి సినిమాతో యువకుల మనసులను తన చీరకు కట్టేసుకుంది భూమిక. మహేష్ బాబు తో ఒక్కడు లో నటించి మెప్పించింది. వరుసగా హిట్లతో తెలుగు ప్రజల్లో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. పెళ్లి అయినా తరవాత పరిశ్రమకు దూరంగా ఉంది. ఇప్పుడు నాని మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో ఆర్టిస్టుగా ఎంట్రీ ఇస్తోంది. వారం రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో భూమిక నానికి వదినగా నటిస్తోంది. ఆమె చుట్టూ కథ నడుస్తున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెప్పింది. అదే సాయి పల్లవికి కంటినిండా నిద్రలేకుండా చేస్తోంది. ఫిదా మూవీతో ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఫిదా సినిమాలో ఇచ్చినంత ప్రయారిటీ ఇందులో ఇవ్వలేదంట. అంతేకాదు ఈ మూవీ  సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకునే ముందు స్వయంగా నిర్మాత దిల్ రాజు చాలా కట్స్  చెప్పారని తెలిసి సాయి పల్లవి మరింత బాధపడిపోతుందంట. ఈ సినిమాలో సాయిపల్లవి చాలా సీన్లలో తన యాక్టింగ్ తో భూమికను డామినేట్ చేసిందని సమాచారం. దీంతో కథ పక్కదారి పడుతుందని భావించిన నిర్మాత కొన్ని సీన్స్ తొలిగించారని తెలిసింది. దీంతో నాని, సాయి పల్లవిల రొమాన్స్ సీన్లు మాత్రమే ఉంచి నటన పరంగా భూమిక వదిన పాత్రను హైలెట్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ సినిమాతో తన క్రేజ్ తగ్గిపోతుందని సాయి పల్లవి దిల్ రాజుపై కోపంగా ఉందని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus