Boyapati Srinu, Allu Arjun: బన్నీ కొత్త సినిమా ప్రకటన అప్పుడేనా?

  • October 26, 2021 / 08:53 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీను పేరు, పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బన్నీ నటిస్తున్న పుష్ప పార్ట్1 షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో బన్నీ తర్వాత సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతోంది. అయితే బన్నీ తర్వాత మూవీ డైరెక్టర్ బోయపాటి శ్రీను అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బోయపాటి శ్రీను ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని సమాచారం.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ మూవీ త్వరలో విడుదల కానుండగా ఆ సినిమా రిలీజైన వెంటనే తర్వాత సినిమా పనులతో బిజీ కావాలని బోయపాటి శ్రీను భావిస్తున్నారు. అతి త్వరలోనే బన్నీ బోయపాటి కాంబో మూవీ గురించి ప్రకటన రానుందని సమాచారం. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలో కామెడీతో పాటు అదిరిపోయే యాక్షన్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మాస్ కథలతో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లను తెరకెక్కించే బోయపాటి శ్రీను చెప్పిన కథ అల్లు అర్జున్ కు ఎంతగానో నచ్చిందని సమాచారం.

ఈ సినిమాతో బోయపాటి శ్రీను సరైనోడు సినిమాను మించిన విజయాన్ని సాధించాలని అనుకుంటున్నారు. బోయపాటి శ్రీను బన్నీతో ఎలాంటి కథను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తుండటం గమనార్హం. కెరీర్ విషయంలో బన్నీ ఆచితూచి అడుగులేయడంతో పాటు సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus