Boyapati Srinu: అక్కినేని హీరోపై బోయపాటి ఫోకస్?

అఖండ సినిమాతో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ఆ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అల్లు అర్జున్ తో కూడా చర్చలు జరిపినట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. నిజానికి అల్లు అర్జున్ తో అయితే మరొక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ అయితే ఉంది. అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు గా అనేక రకాల రూమర్స్ కూడా వచ్చాయి.

కానీ దర్శకుడు బోయపాటి మాత్రం తన తదుపరి సినిమాపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ పై కూడా ఈ దర్శకుడు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కినేని హీరో అఖిల్ 6వ సినిమాకి బోయపాటి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే కొనసాగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా spy యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆ సినిమా తోనే అఖిల్ తన బాక్సాఫీస్ వద్ద తన స్థానాన్ని పెంచుకుంటాడు అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం బోయపాటి కూడా అఖిల్ పైనే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ తో సినిమా ఇప్పట్లో మొదలు పెట్టడం కుదరని పని. ఎందుకంటే పుష్ప అనంతరం బన్నీ ఐకాన్ సినిమా తో పాటు కొరటాల శివ తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ లైనప్ తో ఎంతవరకు ముందుకు సాగుతాడో తెలియదుగానీ బోయపాటి శ్రీను మాత్రం తప్పకుండా చేస్తాడని తెలుస్తోంది.

ఇక బన్నీ డేట్స్ దొరకడం కష్టమని కూడా ఆ లోపు అక్కినేని అఖిల్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus