అరవింద సమేత వీర రాఘవ సినిమా రాయలసీమ నేపథ్యం అనగానే పక్కా మాస్ స్టోరీ అని అర్ధమయిపోయింది. అనేక ఏళ్ళ తర్వాత పూర్తిగా ఎన్టీఆర్ యాక్షన్ మూవీ రాబోతోందని అతని అభిమానులు సంబరపడుతున్నారు. తన ప్రతిభతో ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేయాలనీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కృషి చేస్తున్నారు. ఒకే సమయంలో ప్రొడక్షన్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేపడుతున్నారు. ఎడిటింగుతో పాటు డబ్బింగ్ ను కూడా చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వారితోను సొంతంగా డబ్బింగ్ చెప్పించారు. ఇప్పుడు ఈ చిత్రంలో కీలక రోల్ పోషించిన బ్రహ్మాజీ డబ్బింగ్ చెబుతున్నారు. ఇందుకోసం బ్రహ్మాజీ ప్రత్యేకంగా రాయలసీమ యాసలో డైలాగ్ చెప్పనున్నారు.
దాదాపు ఈ చిత్రంలో అన్ని పాత్రలు ఆ యాసలోనే మాట్లాడనున్నాయి. ఎన్టీఆర్ కూడా సీమ యాసలో డైలాగులు అదరగొట్టనున్నారు. ఎస్ ఎస్ థమన్ స్వరపచిన పాటలను వేడుక లేకుండా ఈనెల 20న నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఇప్పటికే వచ్చిన “అనగనగా” పాట విశేషంగా ఆకట్టుకుంది. మిగతా పాటలు కూడా మెప్పించనున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11 న రిలీజ్ కానుంది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.