Brahmanandam: వాళ్లు చెప్పలేదు… కానీ వైరల్‌ అవుతోంది.. క్లారిటీ ఇస్తారా!

ఇన్నాళ్లు నటించి అలసిపోయి, కొన్ని రోజులు గ్యాప్‌ ఇచ్చాను. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నాను అంటూ ఇటీవల బ్రహ్మానందం ప్రకటించారు. ఓ టీవీ షోలో భాగంగా బ్రహ్మీ ఈ మాట చెప్పారు ఆలస్యం… సోషల్‌ మీడియాలో ఓ పోస్టు వైరల్‌ అవుతోంది. అదే ‘భీమ్లా నాయక్‌’ సినిమాలో బ్రహ్మానందం ఉన్నట్లు చెబుతున్న ఫొటో. బ్రహ్మీ పాత్రను పరిచయం చేస్తున్నట్లు ఆ పోస్టర్‌ వైరల్‌ అవుతోంది. అయితే ఇది ఒరిజినలా లేక ఫ్యాన్‌ మేడా అనేది తెలియదు.

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌ గత కొద్ది రోజుల నుండి ‘భీమ్లా నాయక్‌’ పోస్టర్లు ఈ తరహాలోనే వస్తూ ఉన్నాయి. ఆ సినిమాలో పాత్రలను ఇలానే పరిచయం చేశారు. దీంతో వాళ్లు రిలీజ్‌ చేసి పోస్టరే అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో బ్రహ్మీ నటించడం పక్కా. ఆయనే ఇటీవల అధికారికంగా ప్రకటించారు కూడా. త్వరలో దీనిపై చిత్రబృందం నుండి క్లారిటీ వస్తుందని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాత నాగవంశీ ఎంత క్లారిటీ ఇస్తున్నా పుకార్లు ఆగడం లేదు.

దీంతో మరోసారి నాగవంశీ మంగళవారం సినిమా డేట్‌ను తెలుపుతూ మరో పోస్టర్‌ ట్వీట్‌ చేశాడు. అయితే ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ ₹200 కోట్ల ఆఫర్‌ ఇచ్చింది అంటూ పుకార్లు మొదలయ్యాయి. ఓ జనసేన నాయకుడు చెప్పాడు అంటూ రాసుకొస్తున్నారు. అయితే గతంలో ఇదే విషయంలో ₹150 కోట్ల ఆఫర్‌ విషయం బయటికొచ్చింది. ఇప్పుడు ₹200 కోట్లు. దీనిపై క్లారిటీ ఏమన్నా ఇస్తారేమో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus