ఈ ఏడాది భారీ బడ్జెట్ తో తెరకెక్కి థియేటర్లలో విడుదలైన సినిమాలలో బ్రహ్మాస్త్రం సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. రణ్ బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన హిందీ సినిమాలతో పోల్చి చూస్తే బ్రహ్మాస్త్రం సినిమా బెటర్ టాక్ తో పాటు మంచి కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
అయితే ఈ సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అక్టోబర్ రెండో వారం నుంచి ప్రముఖ భారతీయ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్వాహకులు ఈ సినిమా తమ ఓటీటీకి కచ్చితంగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
తక్కువ సమయంలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం. భారీ మొత్తానికి హక్కులను కొనుగోలు చేయడం వల్ల ఓటీటీ సంస్థ తక్కువ సమయంలోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. బ్రహ్మాస్త్రం పార్ట్1 యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నా నిర్మాతలకు భారీగా లాభాలు రావడంతో బ్రహ్మాస్త్రం పార్ట్2 దిశగా అడుగులు పడుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
బ్రహ్మాస్త్రం ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. రాజమౌళి ప్రమోషన్స్ చేయడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. రాజమౌళి ప్రమోషన్స్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలిసొచ్చింది.
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!