కత్తెరకు పనిపెట్టిన బ్రహ్మోత్సవం
- May 21, 2016 / 01:44 PM ISTByFilmy Focus
కుటుంబ చిత్రాల డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు అలర్ట్ అయ్యారు. సెకండాఫ్ లో సినిమా స్లోగా నడుస్తుందని ప్రేక్షకులు చెప్పడంతో కత్తెరకు పని చెప్పారు. కథకు ఇబ్బంది కలిగించని కొన్ని సీన్లను ట్రిమ్ చేశారు. బ్రహ్మోత్సవం ఫస్ట్ కాపీని చూసినప్పుడే రన్ టైం ని తగ్గించమని మహేష్ బాబు చెప్పారు.
అప్పుడు కొంత తగ్గించి 156 నిముషాలకు చిత్రం రం టైం ను ఫైనల్ చేశారు. ఇందులోంచి ఇప్పుడు 18 నిముషాల సినిమాను తొలగించారు. శనివారం నుంచి 138 నిముషాల బ్రహ్మోత్సవం థియేటర్లలో రన్ కానుంది. సెంటిమెంట్ సీన్లు అధికం కావడంతో బ్రహ్మోత్సవం సినిమాను ఆస్వాదించలేక పోయిన అభిమానులకు ట్రిమ్ చేసిన తర్వాత నైనా నచ్చుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











