పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా వచ్చింది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.టీజర్, ట్రైలర్లు బాగున్నప్పటికీ పాటలు సో సో గానే ఉన్నాయి. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ.. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. కానీ వీక్ డేస్ లో మాత్రం కలెక్షన్స్ చాలా వరకు డ్రాప్ అయ్యాయి.2 వ వారం కూడా పెద్దగా కలెక్ట్ చేసిందంటూ ఏమీ లేదు. ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
20.49 cr
సీడెడ్
6.86 cr
ఉత్తరాంధ్ర
6.85 cr
ఈస్ట్
4.87 cr
వెస్ట్
4.39 cr
గుంటూరు
4.44 cr
కృష్ణా
3.46 cr
నెల్లూరు
1.76 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
53.12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
6.20 cr
ఓవర్సీస్
7.28 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
66.60 cr (షేర్)
‘బ్రో’ (Bro Movie) చిత్రానికి రూ.97.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.98.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.66.60 కోట్లు షేర్ ను రాబట్టింది.
బ్రేక్ ఈవెన్ కి మరో రూ.31.9 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంది. ఈ వారం ‘భోళా శంకర్’ ‘జైలర్’ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. ‘బ్రో’ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవనే చెప్పాలి.