గతేడాది ఆఖరు వరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పట్టిందల్లా బంగారమే. ఏ సినిమా అనుకున్నా.. ఇట్టే డబ్బులు వచ్చేసేవి. పెద్ద సినిమాలు చేయకపోయినా.. మధ్య స్థాయి సినిమాలతోనే పెద్ద లాభాలు సంపాదించారు. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరు టాలీవుడ్లో మారుమోగిపోయింది. ఇప్పుడు పెద్ద హీరోలతో వరుస సినిమా చేస్తున్నారు కూడా. అయితే 2023 వీరికి అంతగా అచ్చి రావడం లేదు. సినిమా ప్రొడ్యూస్ చేసినా.. రిలీజ్ చేసినా ఇబ్బందులే వస్తున్నాయి. అయితే ఈ ఇబ్బందులన్నింటికీ ‘బ్రో’ మందు అవ్వాలి అనుకుంటున్నారట.
పవన్ కల్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం (Bro Movie) ‘బ్రో’. తమిళ హిట్ సినిమా ‘వినోదాయ చిత్తాం’ రీమేక్ ఇది. అక్కడ నటించి దర్శకత్వం వహించిన సముద్రఖని ఇక్కడ తెరకెక్కించారు. ఈ సినిమాను వచ్చే నెలాఖరులో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచారాన్ని స్పీడప్ చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమా టీజర్‌ను త్వరలో రిలీజ్ చేస్తున్నారు. అది టీజర్ మాత్రమే కాదు మొత్తం ప్రొడక్షన్ హౌస్‌కు బూస్టింగ్ ఇచ్చే టాబ్లెట్ అవ్వాలి అంటున్నారు.
సినిమా మీద కాస్త బజ్ ఉన్నా.. అది అంతగా సరిపోవడం లేదు అని ఒక టాక్ ఇండస్ట్రీలో వినిపిచేది. తాజాగా టీమ్ పవన్, సాయితేజ్ కాంబినేషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అందులో ఇద్దరూ ‘తమ్ముడు’లోని ఊర మాస్ లుంగీ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో ఈ సీన్ హైలైట్‌గా నిలుస్తుంది అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ లుక్ తీసుకురావడానికి కారణం ఇటు పవన్ ఫ్యాన్స్‌లో, అటు పీపుల్ మీడియా టీమ్‌లో ఊపు తీసుకురావడానికే అంటున్నారు.
టీజర్ వచ్చాక ఆ ఊపు ఇంకా పెరుగుతుంది అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా ప్రచారం కూడా పవన్ ‘వారాహి’ యాత్రతో పాటు సాగుతుంది అని అంటున్నారు. ఆయన యాత్ర గోదావరి జిల్లాల్లో ఉంది కాబట్టి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేలా చూసుకుంటున్నారట.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!