“బుల్లెట్ రాణి” నాకొక బిగ్ ఛాలెంజ్! -నిషా కొఠారి

“ఇప్పటివరకు తాను చేసిన క్యారెక్టర్స్ అన్నిటిలో “బుల్లెట్ రాణి” లో చేసిన ఇన్స్ పెక్టర్ రాణి  పాత్ర తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, ఈ క్యారెక్టర్ ను ఓ ఛాలెంజ్ గా తీసుకొని చేసానని “బుల్లెట్ రాణి” కథానాయకి నిషా కొఠారి పేర్కొంది.  నిషా కొఠారి టైటిల్ పాత్రలో.. ఫోకస్ ఆన్ పిక్చర్స్ పతాకంపై సాజిద్ ఖురేషి దర్సకత్వంలో ఎం.ఎస్.యూసుఫ్ తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో నిర్మించిన “బుల్లెట్ రాణి” మార్చ్ 10 న కన్నడలో, మార్చ్ 11న తెలుగులో విడుదలై విజయవంతంగా ప్రదర్సితమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకి నిషా కొఠారి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.  చిత్ర దర్శకులు సాజిద్ ఖురేషి తన పాత్రను ఎంతో  ప్రత్యేక  శ్రద్ధతో తీర్చిదిద్దారని, తన పాత్రకు వస్తున్న ప్రశంసలన్నీ ఆయనకే చెందుతాయని నిషా పేర్కొంది. ఆశిష్ విద్యార్ధి, రవి కాలే వంటి ప్రతిభావంతులతో కలిసి నటించడం తనకు చాలా సంతోషాన్ని, ఎంతో అనుభవాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది. తెలుగులో తను నటించిన “క్రిమినల్స్” చిత్రం త్వరలో విడుదల కానుందని, ప్రస్తుతం తాను హిందీ లో రెండు, కన్నడలో ఒక సినిమా చేస్తున్నానని, తెలుగులోనూ మరో చిత్రానికి సంతకం చేయనున్నానని నిషా కొఠారి చెప్పింది!!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus