Urvasivo Rakshasivo: అల్లు సిరీస్ కి మంచి ఛాన్స్.. హిట్ కొడతాడా..?

Advertisement

ఎప్పటిలానే ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈసారి ఏకంగా పది సినిమాల వరకు రిలీజ్ అవుతున్నాయి. అందులో అరడజను సినిమాలపై సరైన బజ్ లేదు. హీరోలు, డైరెక్టర్లు ఎవరూ కూడా జనాలకు పరిచయం లేదు. అవన్నీ నామమాత్రపు రిలీజులనే చెప్పాలి. వాటిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. మిగిలిన వాటిలో కూడా పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలేవీ లేవు. కాస్తో కూస్తో అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకి మంచి బజ్ ఉంది.

దానికి కారణం.. ఈ సినిమాలో యూత్ ను ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. ఆ యాంగిల్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్లాన్ చేశారు. అందుకే లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్ తో కూడిన ప్రోమోలు రిలీజ్ చేసి.. కొంతమేర క్రేజ్ తీసుకురాగలిగారు. ఇక ఈ వారం బరిలో ఉన్న మిగతా చిత్రాల్లో ‘ఊర్వశివో రాక్షసివో’ తరువాత జనాల దృష్టి ఆకర్షిస్తున్న సినిమా ‘లైక్ షేర్ అండ్ స‌బ్‌స్క్రైబ్‌’.

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన మేర్లపాక గాంధీ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో జంటగా నటించారు. సినిమాపై చెప్పుకోదగ్గ బజ్ అయితే రాలేదు. కానీ టాక్ బాగుంటే జనాలు థియేటర్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. వీటితో పాటు నవీన్ చంద్ర ‘తగ్గేదేలే’, నందు ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమాకు కూడా పెద్దగా బజ్ రాలేదు.

ఇవన్నీ కూడా టాక్ ను బట్టి పుంజుకునే సినిమాలు. ప్రస్తుతానికైతే.. ఈ వారం సినిమాల్లో కొంతవరకు హైప్ అంటే శిరీష్ సినిమాకే ఉంది. సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అల్లు హీరో ఈ అడ్వాంటేజ్ ను ఎంతవరకు ఉపయోగించుకుంటారో చూడాలి!

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus