Calling Sahasra: సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • December 2, 2023 / 11:49 AM IST

బుల్లితెర పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్‌ అలియాస్ సుధీర్ ఆనంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’. ‘షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌’, ‘రాధా ఆర్ట్స్’ బ్యానర్ల పై విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డాలీషా హీరోయిన్‌గా నటించింది. డిసెంబ‌ర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

టీజర్, ట్రైలర్.. కొత్తగా ఉన్నాయి. సుధీర్ హీరోగా చేసిన గత చిత్రాలు ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ ‘గాలోడు’ బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్ట్ చేశాయి. దీంతో ‘కాలింగ్ సహస్ర’ పై ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.అందుకే ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కొన్ని ఏరియాల్లో బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 0.80 cr
సీడెడ్ 0.50 cr
ఆంధ్ర 0.90 cr
ఏపీ + తెలంగాణ 2.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ 0.30 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.50 cr

‘కాలింగ్ సహస్ర’ (Calling Sahasra) చిత్రానికి రూ.2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.8 కోట్ల షేర్ ను రాబట్టాలి. అంత టార్గెట్ ను రీచ్ అవ్వడం అంటే మాటలు కాదు. పైగా ‘యానిమల్’ చిత్రంపై భారీ హైప్ ఉంది. మరి ఆ సినిమా పక్కన ఇది ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus