ప్లాన్ బానే ఉంది.. అరవింద్ గారు ఏమంటారో?

Advertisement

ఇటీవల వచ్చిన ‘జెర్సీ’ చిత్రం మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ అద్భుతమని… నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని క్రిటిక్స్ ‘జెర్సీ’ చిత్రం ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రానికి లాభాలైతే రాకపోగా నష్టాలు తప్పలేదు. దీనికి ప్రధాన కారణం.. లారెన్స్. అవును లారెన్స్ తెరకెక్కించిన ‘కాంచన 3’ చిత్రం కూడా ‘జెర్సీ’ విడుదలైన రోజే రిలీజవ్వడంతో పెద్దదెబ్బ పడింది. మాస్ ఆడియన్స్ మొత్తం ‘కాంచన3’ చిత్రానికే ఓటేశారు. దీంతో ‘జెర్సీ’ చిత్రానికి నష్టాలు తప్పలేదు.

ఇప్పుడు ఈ నష్టాలను తీర్చే బాధ్యత బన్నీ పై పడింది. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రాన్ని కూడా ‘హారిక హాసిని క్రియేషన్స్’ సంస్థే నిర్మించబోతోంది. ఇక ‘జెర్సీ’ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ అంటే ‘హారిక హాసిని క్రియేషన్స్’ కు బ్రాంచ్ లాంటిదన్న మాట. ఇక నాని ‘జెర్సీ’ చిత్రానికి వచ్చిన నష్టాల్ని బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంతో తీర్చాలని నిర్మాతలలో ఒకరైన రాధా కృష్ణ భావిస్తున్నాడట. అయితే బన్నీ చిత్రానికి అల్లు అరవింద్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు మొత్తం ఆయనే చూసుకుంటారని సమాచారం. మరి రాధా కృష్ణ నిర్ణయానికి అల్లు అరవింద్ ఓకే చెప్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus