గతేడాది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్.. ఆ తర్వాత చాలా గ్యాప్. ప్రజెంట్ సిట్యువేషన్ ప్రకారం ఈ ఏడాది ఆయన నుండి సినిమా రాదు. వచ్చే ఏడాది రాబోయే సినిమా గురించి ఇప్పుడు చర్చంతా. అధిక్ రవిచంద్రన్‌తో వరుసగా జట్టు కడుతున్నాడు అజిత్. ఈసారి ఏకేని ‘డేర్ డెవిల్’గా చూపించాలని రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో సినిమా గురించి వరుస వార్తలు వస్తున్నాయి. మొన్నీమధ్య హీరోయిన్ గురించి లీక్ రాగా.. ఇప్పుడు అతిథి పాత్రల గురించి తెలిసింది..
అవును, అజిత్ చేయబోయే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేసి, అన్ని పరిశ్రమల్లోనూ మంచి వసూళ్లు సాధించాలని టీమ్ ప్లాన్ చేస్తోందట. ఈ క్రమంలో తెలుగు, కన్నడ, మలయాళం నుండి కొన్ని కేమియోలను ప్లాన్ చేస్తున్నారట. అలా తెలుగు, తమిళ పరిశ్రమలకు సంబంధించిన హీరోలను దాదాపు ఫిక్స్ చేశారు అని చెబుతున్నారు. తెలుగు నుండి వెంకటేశ్‌ను కాంటాక్ట్ అవుతుండగా, మలయాళం నుండి మోహన్ లాల్‌ను అడుగుతున్నారట.
ఏదో అలా వచ్చి వెళ్లిపోయే కేమియోలా కాకుండా ‘జైలర్’ సినిమాల తరహాలో ఆ కేమియోలు ఉంటాయి అని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించుకునే ఈ సినిమాలో హీరోయిన్‌గా కయాదు లోహర్‌ను ఎంపిక చేశారు అని చెబుతున్నారు. ఇక ఈ సినిమాను అజిత్ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న విషయం తెలిసిందే. భార్య షాలినినే ఈ సినిమాకు నిర్మాత.
అజిత్‌ను నెవ్వర్ బిఫోర్ లుక్‌లో చూపించడానికి ఇప్పటికే అధిక్ రవిచంద్రన్ పనులు స్టార్ట్ చేశారట. సుమారు రెండేళ్ల తర్వాత అజిత్ నుండి రాబోయే ఈ సినిమా మీద ఇప్పటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ‘జైలర్’ తరహాలోనే కేమియోలు పెడితే ‘వాళ్లు చేసిందే మీరూ చేశారు. కొత్తేముంది’ అనే మాట వచ్చేస్తుంది. కాబట్టి సినిమా టీమ్ కొత్తగా ఆలోచించాల్సిందే.