స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అఖండ సినిమా రిలీజ్ కు ముందే నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి భారీ లాభాలను అందజేస్తోంది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. దాదాపు 90 కోట్ల మేర ఈ సినిమాకు బిజినెస్ జరిగినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే బాలయ్య ఇదే స్థాయిలో కలెక్షన్లను సాధించాల్సి ఉంది.
ప్రస్తుతం స్టార్ హీరోలంతా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు సునాయాసంగా టార్గెట్ ను రీచ్ కాగా మరి కొందరు హీరోలు ఆ టార్గెట్ ను రీచ్ కావాల్సి ఉంది. మరోవైపు ఈ మధ్య కాలంలో బాలకృష్ణ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. బాలయ్య అఖండ సినిమాతో సక్సెస్ సాధించడంతో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాలని భావిస్తున్నారు.
అఖండ సినిమాతో బాలకృష్ణ కోరిక తీరుతుందో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు బోయపాటి శ్రీను వినయ విధేయ రామ సినిమాతో తీవ్రస్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నారు. అఖండ సినిమాతో ఆ విమర్శలకు చెక్ పెట్టాలని బోయపాటి శ్రీను భావిస్తున్నారు. అఖండ సినిమా తరువాత బోయపాటి శ్రీను రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.