బోయపాటి దర్శకత్వంలో నటించడానికి పవన్ చర్చలు?

నటసింహ బాలకృష్ణ ఇక నటనకు గుడ్ బై చెప్పవచ్చు.. అని విమర్శలు వస్తున్న కాలంలో బోయపాటి శ్రీను ఆయనతో సింహ వంటి సినిమాని తీసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. అలాగే 2014 ఎలక్షన్ సమయంలో బాలయ్యతో లెజెండ్ సినిమాని రూపొందించి.. హిట్ తో పాటు బాలయ్య ఎన్నికల్లో విజయం సాధించడానికి పరోక్షంగా కారణమయ్యారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని బాలకృష్ణ మళ్ళీ ఎన్నికల ముందు ఓ కథని ప్రిపేర్ చేయమని బాలకృష్ణ బోయపాటికి ఎప్పుడో చెప్పి పెట్టారంట. ఎన్నికలకు ఉపయోగపడే కథ ఏదైనా ఉంటే తనకి వినిపించమని బోయపాటిని పవన్ కోరినట్లు ఫిలిం నగరవాసులు చెబుతున్నారు. పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నమ్మకం పెట్టుకున్నారు. తాను ప్రజల్లోకి వెళ్లేముందు మంచి చిత్రం తీయాలని కలలు కన్నారు.

కష్టపడ్డారు కూడా. కానీ అజ్ఞాతవాసి ఫలితం తారుమారు అయింది. దీంతో ఎన్నికలు లోపున మరో సినిమా తీయాలని పవన్ భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ కథని ప్రిపేర్ చేయమని పవన్ స్వయంగా బోయపాటిని అడిగినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జయ జానకి నాయక మూవీ తర్వాత బోయపాటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న బోయపాటి .. దీని తర్వాత పవన్ తో సినిమా చేస్తారా? బాలకృష్ణకే కథ సిద్ధం చేస్తారా? అనేది సస్పెన్స్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus