నాగ బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

  • May 21, 2020 / 07:23 PM IST

నాథురామ్ గాడ్సే చర్యను సమర్ధిస్తూ మెగా బ్రదర్ నాగ బాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం అవుతుండగా.. ఆయనపై కేసులు కూడా నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో టీపీసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ బుధవారం ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు కొందరు మనోభావాలు దెబ్బ తీసేలా, సాంఘిక అశాంతికి దారితీసేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కేసు పైల్ చేయడం జరిగింది.

దీనితో ఇప్పటిలో ఈ వివాదం నాగబాబును వదిలే సూచనలు కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం నాగబాబు ”ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కదా అనేది డిబేటబుల్. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్‌ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు.

కానీ నాధురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే… మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ తీవ్ర విమర్శలకి దారితీయండంతో నేడు మరో ట్వీట్స్ ద్వారా ఇది నా వ్యక్తి గత అభిప్రాయం, జనసేన పార్టీకి, నా కుటుంబానికి సంబంధం లేదని సంజాయిషీ ఇచ్చుకున్నారు.


Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus