ఒకప్పుడు నటీమణులు.. పై మాత్రమే లైంగిక ఆరోపణలు నమోదయ్యేవి. తర్వాత కొంతమంది టాప్ సింగర్స్ … కొంతమంది లిరిసిస్ట్ ల వల్ల లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నట్టు చెప్పి హాట్ టాపిక్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ సింగర్ రాహుల్ జైన్ తన గాత్రంతో కుర్రకారులో జోష్ నింపుతూ ఉంటాడు. ఇలాంటి సింగర్ ఓ కాస్ట్యూమ్ డిజైనర్ పై అత్యాచారం చేశాడు అంటూ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అవ్వడం చర్చనీయాంశం అయ్యింది.
పోలీసు స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ప్రకారం.. ‘కాస్ట్యూమ్ డిజైనర్ పని నచ్చడంతో ఆమెను రాహుల్ ప్రశంసిస్తూ ఇన్ స్టా గ్రామ్ లో మెసేజ్ చేశాడట , అలాగే తనకు పని ఇప్పిస్తానని తన వద్దకు రమ్మని చెప్పాడట. దీంతో ఆ కాస్ట్యూమ్ డిజైనర్ వెంటనే రాహుల్ ప్లాట్ కు వెళ్ళింది. ఆ టైంలో రాహుల్ ఆమె పై లైంగికంగా దాడి చేశాడట. అందుకు సంబంధించిన ఆధారాలన్నింటిని అతను ఫొన్ నుంచి తొలగించాడని’ కాస్ట్యూమ్ డిజైనర్ అయినా ఆ అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో రాహుల్ పై 376, 323, 506, 504 సెక్షన్ల కింద కేసు పెట్టి విచారణ చేపట్టారు పోలీసులు. ఈ విషయం పై సింగర్ రాహుల్ స్పందిస్తూ.. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పింది అంతా అబద్దం అంటూ ఖండించాడు. ఆమె ఎవరో నాకు తెలీదు, తనని చూడటం ఇదే మొదటిసారి… అంటూ అతను చెప్పుకొచ్చాడు. గతంలో కూడా పలు సార్లు తనపై తప్పుడు కేసు పెట్టారని రాహుల్ తెలిపాడు.న్యాయస్థానం పై అతనికి నమ్మకం ఉందని నిజా నిజాలు జనాలకు తెలుస్తాయి అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు రాహుల్.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?