‘వాల్మీకి’ చిత్రం పై హోకోర్టులో పిటిషన్‌!

వరుణ్ తేజ్, అథర్వ మురళి ప్రధాన పాత్రల్లో ‘వాల్మీకి’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోలీవుడ్ ‘జిగర్తాండ’ చిత్రానికి ఇది రీమేక్. ఇక ‘వాల్మీకి’ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఓ గ్యాంగ్‌స్టర్‌ కథకి ‘వాల్మీకి’ అనే టైటిల్ ను ఎలా పెడతారంటూ బీసీ సంక్షేమ సంఘాలు వివాదాలకు దిగిన సంగతి తెలిసిందే. ‘వాల్మీకి’ సినిమా పేరును వెంటనే మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

గతంలో బోయ సంఘాలు వారు కూడా తమ కులానికి చెందిన వ్యక్తి పేరుని టైటిల్ గా పెట్టడం పై పెద్ద గొడవ చేసి షూటింగ్ కూడా ఆపేసిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ మార్చాలని ధర్నా కూడా చేపట్టారు. అయితే ఈ విషయం పై చిత్ర యూనిట్ మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. సెప్టెంబర్ 13న సినిమాని విడుదల చేస్తున్నాం అని ప్రమోషన్లు కూడా మొదలు పెట్టేశారు. ఇప్పుడు బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్‌ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరుతున్నారు. సినిమా యూనిట్ సభ్యుల పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరి ఈ విషయం పై ‘వాల్మీకి’ దర్శకనిర్మాతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus