హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల అంటే రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్, జర్నలిస్ట్ కాలనీ వద్ద.. కారులో రాంగ్ రూట్లో వస్తుండగా.. ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను నిలదీశాడు. అయినా తగ్గకుండా అతనిపైకి దూసుకొచ్చాడు శ్రీనివాస్. దీంతో కారు పక్కకు తీసుకుని.. కిందకి దిగాలని ఆ కానిస్టేబుల్ కోరగా, అది పట్టించుకోకుండా శ్రీనివాస్ అక్కడి నుండి రాష్ గా కారు నడుపుతూ వెళ్ళిపోయాడట.
దీంతో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ జూబ్లీహిల్స్ పీఎస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశాడు. ఇప్పుడు ఈ విషయంపై విచారణ చేపట్టారు. అలాగే ఈ ఘటనపై సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. మరి శ్రీనివాస్ ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి. మరోపక్క మే 30న బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘భైరవం’ (Bhairavam) సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అలాగే ‘హైందవం’ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు.
మరోపక్క ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) అనే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మధ్యనే ‘కిష్కింధపురి’ (Kishkindhapuri) అనే సినిమాకు సంబంధించిన మరో గ్లింప్స్ కూడా బయటకు వచ్చింది. ఇలా చేతి నిండా సినిమాలతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బిజీగా గడుపుతున్నాడు. అలాగే ఇంకో 2 రీమేక్ కథలను కూడా ఓకే చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇలాంటి టైంలో అతనిపై పోలీస్ కేసు నమోదవడంతో.. అతనితో పనిచేస్తున్న దర్శక నిర్మాతలు కూడా కంగారు మొదలైనట్టు సమాచారం.