HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3′(HIT 3) . శైలేష్ కొలను  (Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది. నాని తన సోదరి ప్రశాంతి తిపిర్నేనితో (Prashanti Tipirneni)  కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. మొదటి రోజు ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. దీంతో ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం ఖాయం అని అంతా అనుకున్నారు.

HIT 3

కానీ రెండో రోజు నుండి కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో పలు చోట్ల వర్షాలు పడటం వల్ల.. సినిమాకి కలెక్షన్స్ పై ప్రభావం చూపించినట్టు అయ్యింది. అయినప్పటికీ సినిమా రూ.100 కోట్లు పైనే వసూల్ చేసినట్టు నిర్మాతలు పోస్టర్లు వేసుకోవడం జరిగింది. అయితే ఓవరాల్ గా ‘హిట్ 3’ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిన మాట వాస్తవమే. కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం నష్టాలనే మిగిల్చింది.

తాజాగా ఈస్ట్ గోదావరికి చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ మీడియా ముందుకు వచ్చి.. ‘హిట్ 3’ సినిమా వల్ల తమ ఏరియాలో రూ.50 లక్షలకు పైగా నష్టం వచ్చినట్టు డైరెక్ట్ గా రివీల్ చేశాడు. సో సినిమాలకి ఎంత హిట్ టాక్ వచ్చినా… జనాలు థియేటర్లకు రావడం తగ్గించారు అనేది.. ఈ డిస్ట్రిబ్యూటర్ కామెంట్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ‘హిట్ 3’ అనే కాదు చాలా పాన్ ఇండియా సినిమాలకి హిట్ టాక్ వచ్చినా కొన్ని మేజర్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడం లేదు.

 ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus