Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు
- April 26, 2026 / 11:26 AM ISTByPhani Kumar
ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ ఫోటోషూట్స్, రీల్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి(Ashu Reddy).. ఇప్పుడు ఏకంగా ఓ భారీ చీటింగ్ కేసులో చిక్కుకుని వార్తల్లో నిలిచింది.
Ashu Reddy
గ్లామర్ షోతో ఫాలోవర్స్‌ను పెంచుకునే ఈ భామ, రియల్ లైఫ్‌లో మాత్రం ఏకంగా కోట్ల రూపాయల స్కామ్‌కు తెరతీసినట్లు తెలుస్తోంది. పెళ్లి వల విసిరి ఓ ఎన్ఆర్ఐని దారుణంగా మోసం చేసిందంటూ హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదు కావడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

బయట టాక్ ప్రకారం.. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సెటిల్ అయిన వై.వి. ధర్మేంద్ర అనే యువకుడికి 2018లో అషురెడ్డితో పరిచయం ఏర్పడిందట. తాను అమెరికాలో చదువుకున్నానని, సినిమాల్లో ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్నానని చెప్పి అతన్ని బురిడీ కొట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ పరిచయాన్ని మెల్లగా ప్రేమగా మార్చి, పెళ్లి చేసుకుంటానని నమ్మించిందని.. ఇక అక్కడినుంచే డబ్బు కాజేయడం స్టార్ట్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది.
రకరకాల అవసరాల పేరుతో 2018 నుంచి ఇప్పటివరకు ధర్మేంద్ర దగ్గర నుంచి ఏకంగా రూ.9.35 కోట్లు వసూలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆ డబ్బుతో ఖరీదైన కార్లు, ఫ్లాట్లు కొనడమే కాకుండా.. సుమారు 5 కిలోల బంగారాన్ని కూడా తన పేరిట రాయించుకుందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెళ్లి ఫిక్స్ చేస్తూ రెండు కుటుంబాలు కలిసి పూజలు కూడా చేశారట. కానీ, ఆస్తులన్నీ తన పేరిట రిజిస్టర్ అయ్యాక అషురెడ్డి ప్లేట్ ఫిరాయించిందని ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, అషురెడ్డి సోదరి సైతం తమ దగ్గర మరో రూ.50 లక్షలు తీసుకుందని ఆయన బాంబ్ పేల్చారు.ఈ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్స్ ఆధారంగా నిజాలు రాబట్టే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో నెలకు రూ.399 కడితే స్పెషల్ కంటెంట్ ఇస్తానంటూ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టి నెటిజన్ల నుంచి విపరీతమైన విమర్శలు ఎదుర్కొంది.
ఇన్ని ఆరోపణలు వస్తున్నా అషురెడ్డి మాత్రం ఈ ఇష్యూపై ఇంకా స్పందించలేదు. ఈ కేసులో నిజమెంత అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో పూర్తిగా తేలాల్సి ఉంది.












