Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 3, 2026 / 07:14 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సంగీత్ శోభ‌న్‌ (Hero)
  • న‌య‌న్ సారిక‌ (Heroine)
  • గెట‌ప్ శీను, వెన్నెల‌కిషోర్‌, ఆశీష్ విద్యార్థి, బ్ర‌హ్మాజీ, రోహిణి, త‌నికెళ్ల‌భ‌ర‌ణి త‌దిత‌రులు (Cast)
  • మాన‌స శ‌ర్మ‌ (Director)
  • నిహారిక కొణిదెల‌, ఉమేశ్ కుమార్ బ‌న్సాల్‌ (Producer)
  • అనుదీప్ దేవ్‌ (Music)
  • రాజు (Cinematography)
  • అన్వ‌ర్ అలీ (Editor)
  • Release Date : 03 ఏప్రిల్ 2026
  • పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ (Banner)

ప్రొడ్యూస‌ర్‌గా క‌మిటీ కుర్రాళ్లుతో తొలి ప్ర‌య‌త్నంలోనే పెద్ద విజ‌యాన్ని అందుకుంది మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌రోసారి కొత్త టాలెంట్‌ను న‌మ్మి నిహారిక నిర్మించిన తాజా సినిమా రాక‌స‌ (Raakaasaa). సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాతో మాన‌స శ‌ర్మ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గెట‌ప్ శీను, వెన్నెల‌కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హార‌ర్ కామెడీగా తెర‌కెక్కిన రాకస మూవీ ఏప్రిల్ 3న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రొడ్యూస‌ర్‌గా నిహారిక‌కు మ‌రో హిట్టు ద‌క్కిందా? స‌ంగీత్ శోభ‌న్ న‌వ్వించాడా? లేదా అంటే?

Raakaasaa Movie Review

Raakaasaa Movie Review and Rating

క‌థ‌: రాక‌వ‌నం ఊరికి చెందిన వీర‌బాబు అలియాస్ వీర (సంగీత్ శోభ‌న్‌) అమెరికా నుంచి తాను ప్రేమించిన అమ్మాయి సుక‌న్య కోసం సొంత ఊరికి వ‌స్తాడు. కానీ సుక‌న్య మాత్రం వీర‌ను మోసం చేసి మ‌రో అబ్బాయిని పెళ్లిచేసుకుంటుంది. బ్రేక‌ప్ బాధ‌లో ఉన్న టైమ్‌లోనే సోము (వెన్నెల‌కిషోర్‌) అనే వ్య‌క్తిని హ‌త్య చేశాడ‌నే ఆరోప‌ణ‌ల కార‌ణంగా వీర పాస్‌పోర్ట్‌ను పోలీసులు లాగేసుకుంటారు. ఆ ఊరి పొలిమేర‌లోని పాడుబ‌డ్డ కోట‌లో ఉన్న రాక్ష‌సుడికి న‌ర‌బ‌లి ఇచ్చే ఆన‌వాయితీ ఉంటుంది. బ‌లి కోసం గంగ‌య్య అనే ముస‌లాడి పేరును ఊరి పెద్ద‌లంతా క‌లిసి నిర్ణ‌యిస్తారు. కానీ చివ‌రి నిమిషంలో ఆ వృద్దుడు చ‌నిపోవ‌డంతో వీర స్నేహితుడు బాల‌రాజును (గెట‌ప్ శీను) కోట‌లోకి పంపాల‌ని అనుకుంటారు ఊరి ప్ర‌జ‌లు.

కానీ బాల‌రాజు బ‌దులు వీర కోట‌లోకి వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అలా ఎందుకు జ‌రిగింది? రాక‌వ‌నం ఊరిని వెంటాడుతున్న ఆ రాక్ష‌సుడి క‌థేమిటి? ఆ కోట‌లోకి అడుగుపెట్టిన వీర‌కు ఎలాంటి భ‌యాన‌క అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? వీరను వెతుక్కుంటూ కోట‌లోకి వ‌చ్చిన సుబ్బ‌ల‌క్ష్మి (న‌య‌న్ సారిక‌) ఎవ‌రు? చ‌నిపోయాడ‌ని అనుకున్న సోము ఆ కోట‌లో ఎందుకు ఉన్నాడు? రాక్ష‌సుడి బారి నుంచి త‌ప్పించుకొని వీర‌, సుబ్బ‌ల‌క్ష్మి కోట బ‌య‌ట అడుగుపెట్టారా? లేదా? అన్న‌దే రాకస మూవీ క‌థ‌.

Raakaasaa Movie Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: వీర పాత్ర‌లో సంగీత్‌ శోభ‌న్ అద‌ర‌గొట్టేశాడు. త‌న‌ కామెడీ టైమింగ్‌, పంచ్‌ల‌తో స్టార్టింగ్ నుంచి చివ‌రి వ‌ర‌కు న‌వ్వించాడు. ఎన‌ర్జిటిక్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. న‌య‌న్ సారిక న‌ట‌న ఓకే. ఓ పాట‌లో హీరోతో ఆమె కెమిస్ట్రీ బాగుంది. హీరోతో స‌మానంగా ఫుల్‌లెంగ్త్ పాత్ర‌లో గెట‌ప్ శీను క‌నిపించాడు. సంగీత్ శోభ‌న్‌తో పోటీప‌డి కామెడీని పండించాడు. వెన్నెల‌కిషోర్ క్యారెక్ట‌ర్ సెకండాఫ్‌లో ఎంట్రీ ఇస్తుంది. కామెడీ విష‌యంలో అత‌డి క్యారెక్ట‌ర్ తేలిపోయింది. రోహిణి, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశీష్ విద్యార్థి, బ్ర‌హ్మాజీతో పాటు మిగిలిన వారు త‌మ ప‌రిధుల మేర ఆక‌ట్టుకున్నారు.

Raakaasaa Movie Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: మాన‌స శ‌ర్మ డైరెక్ట‌ర్‌గా కంటే రైట‌ర్‌గా ఎక్కువ‌గా మెప్పించింది. డైరెక్ష‌న్ విష‌యంలో ఆమెలో సెకండాఫ్ సిండ్రోమ్ కొంత క‌నిపించింది. చిన్న సినిమానే అయినా ఎక్క‌డ రాజీ ప‌డ‌కుండా నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మించారు.అనుదీప్ దేవ్ మ్యూజిక్, రాజు సినిమాటోగ్రాఫీ బాగున్నాయి.

Raakaasaa Movie Review and Rating

విశ్లేష‌ణ‌: హార‌ర్ కామెడీని మినిమం గ్యారెంటీగా చెబుతుంటారు. మిగిలిన జాన‌ర్స్‌తో పోలిస్తే ఈ క‌థ‌ల‌ స‌క్సెస్ రేటు కాస్త ఎక్కువే. హార‌ర్ కామెడీ సినిమాల‌కు భారీ కాస్టింగ్‌, పెద్ద సెట‌ప్‌లు అవ‌స‌రం లేదు. ఒకే లొకేష‌న్‌లో సినిమా మొత్తాన్ని న‌డిపించే వెసులుబాటు ఉంటుంది. కామెడీ, కాన్సెప్ట్‌ను బాగా రాసుకుంటే చాలు…లాజిక్‌ల‌తో ప‌నిలేకుండా ఈ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి.

అలాంటి మంచి సెట‌ప్ రాక‌స‌కు కుదిరింది. సాధార‌ణంగా హార‌ర్ కామెడీ అన‌గానే రివేంజ్ కోసం ఓ పాడుబ‌డ్డ ఇంట్లో ఎదురుచూసే ఆత్మ‌…ఆ బిల్డింగ్‌లోకి హీరో గ్యాంగ్ ఎంట‌ర్‌కావ‌డం.. ఈ క్ర‌మంలో జ‌రిగే డ్రామా చుట్టూ న‌డుస్తుంటాయి. ఈ రొటీన్ ఫార్మెట్‌కు భిన్నంగా రాక‌స క‌థ‌ను రాసుకున్నారు డైరెక్ట‌ర్ మాన‌స శ‌ర్మ‌. ఊరిని ప‌ట్టి పీడించే రాక్ష‌సుడు…అత‌డిని చంపాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన రాజుల చ‌రిత్ర‌తో సినిమా ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభ‌మ‌వుతుంది. మొద‌టే ట్విస్ట్‌ల‌న్ని రివీల్ చేయ‌కుండా కొన్ని దాచేసి హీరో క్యారెక్ట‌ర్‌ను స్క్రీన్‌పైకి తీసుకొచ్చి కామెడీలోకి క‌థ‌ను షిప్ట్ చేశారు. త‌న‌కు సంబంధంలేని విష‌యాల్లో క‌లుగ‌జేసుకుంటూ హీరో ఇబ్బందులు ప‌డే సీన్స్ నుంచి ఫ‌స్ట్ హాఫ్‌లో చ‌క్క‌టి ఫ‌న్ జ‌న‌రేట్ అయ్యింది.

ఈ సీన్ల‌లో సంగీత్ శోభ‌న్ వ‌న్ లైన‌ర్స్ బాగా పేలాయి. అత‌డికి గెట‌ప్ శీను తోడ‌వ్వ‌డం కూడా ప్ల‌స్స‌య్యింది. పంచాయితీ ఎపిసోడ్, పోలీసుల ఇంట‌రాగేష‌న్‌తో పాటు మ‌రికొన్ని సీన్స్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. హీరోనే కోట‌లోని రాక్ష‌సుడితో పోరాడుతాడ‌న్న‌ది సినిమా ఆరంభ‌మైన అర‌గంట‌కే ఆడియెన్స్‌కు అర్థ‌మైపోతుంది. అందుకు దారితీసిన ప‌రిస్థితుల‌ను కూడా ఫ‌న్నీగానే చూపించారు డైరెక్ట‌ర్‌. వృద్ధుడిని సేవ్ చేయ‌బోయి హీరోతో పాటు గెట‌ప్ శ్రీను ఇరుక్కునే ఎపిసోడ్ హిలేరియ‌స్‌గా న‌వ్విస్తుంది.

సెకండాఫ్ మొత్తం కోట లోప‌లే నాలుగే పాత్ర‌ల చుట్టే తిరుగుతుంది. రాక్ష‌సుడి బారి నుంచి హీరో అండ్ గ్యాంగ్ త‌ప్పించుకుంటారా? లేదా? అనే టెన్ష‌న్ బిల్డ్ చేశారు. మ‌రోవైపు సీరియ‌స్ సిట్యూవేష‌న్‌లో సంగీత్ శోభ‌న్‌తో పాటు వెన్నెల‌కిషోర్ వేసే పంచ్‌ల‌తో కామెడీ, హార‌ర్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చివ‌రి వ‌ర‌కు క‌థ‌ను న‌డిపించారు. ఓ చిన్న ఎమోష‌న‌ల్ సీన్‌తో ఎండ్ చేయ‌డం బాగుంది. ఆ ఎపిసోడ్‌ను ఇంకాస్త డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది.

రాక్ష‌సుడితో పాటు కోట తాలూకు చిక్కుముడులు రివీల‌య్యే సీన్ల‌లో ఆస‌క్తి లోపించింది. రాక్ష‌సుడి గురించి ఓ రేంజ్‌లో బిల్డ‌ప్ ఇస్తారు. కానీ కోట లోప‌ల మాత్రం హీరో అండ్ గ్యాప్ స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూ తిర‌గ‌డం, అయినా వారిని రాక్ష‌సుడు ఏం చేయ‌క‌పోవ‌డం కాస్త‌ సిల్లీగానే అనిపిస్తుంది. హార‌ర్ ఎలిమెంట్స్‌లో ఆశించిన మేర థ్రిల్స్ లేవు. ఫ‌స్ట్ హాఫ్‌లో ఉన్న కామెడీ టెంపో సెకండాఫ్‌లో కొంత మిస్స‌యిన ఫీలింగ్ క‌లుగుతుంది.

Raakaasaa Movie Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: రాక‌స న‌వ్విస్తూనే భ‌య‌పెట్టే టైమ్‌పాస్ హార‌ర్ కామెడీ మూవీ.

రేటింగ్‌: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manasa Sharma
  • #Nayan Sarika
  • #Raakaasaa Movie
  • #Sangeeth Shobhan
  • #Sangeeth Sobhan

Reviews

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

trending news

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

49 mins ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 days ago

latest news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

1 day ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version