మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలోకి మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ బ్యూటీ ఎవరో కాదు, కేథరిన్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా, కేథరిన్‌ను సెకండ్ లీడ్ కోసం తీసుకున్నారు.
అయితే ఆమె పాత్ర కేవలం గెస్ట్ రోల్ కాదని, కథలో చాలా కీలకమైన, పవర్‌ఫుల్ రోల్ అని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ప్రత్యేకంగా కేథరిన్ కోసం ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారట. గమ్మత్తేంటంటే, కేథరిన్ ఇంతకుముందు చిరంజీవి బ్లాక్ బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’లో నటించింది. కానీ ఆ సినిమాలో ఆమె మాస్ మహారాజా రవితేజకు జోడీగా కనిపించింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌తోనే స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది.ఈ సినిమా సెట్స్‌లోనే మెగాస్టార్, యంగ్ క్రికెట్ సెన్సేషన్ తిలక్ వర్మను కూడా కలిశారు.
ఫుల్ కామెడీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. అనిల్ రావిపూడి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలకు కూడా మంచి వెయిట్ ఉంటుంది. అందుకే ఈ సినిమాలో కేథరిన్ రోల్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తి నెలకొంది. టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్నా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న కేథరిన్‌కు, ఈ సినిమా కెరీర్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.