‘ఎమెల్యే’పై ఆసక్తిగా చిరు!!!

  • May 21, 2016 / 07:49 AM IST

దాదాపుగా రెండు ఏళ్లు దాటేసింది. అదిగో…ఇదిగో అంటూ మెగా అభిమానుల్ని ఊరిస్తున్న సినిమా మెగా స్టార్ 150వ సినిమా. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలీదు కానీ, రోజుకో న్యూస్ మాత్రం ఈ సినిమా గురించి బయటకు వస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే…ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వీ.వీ.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరు 150వ సినిమా ‘కత్తి’లాంటివాడు చివరకు సెట్స్ పైకి వెళ్లినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక లేడీ ఎమెల్యే నటించనుంది అని, ఆ భామతో మన చిరు రొమ్యాన్స్ చేసాడని సమాచారం. లేడీ ఎమెల్యే అంటే ఎవరో అనుకునేరు….ఎవరో కాదండి అందాల భామ కేథ‌రిన్. అదే మన బన్నీ సరైనోడులో సెక్సీ ఎమెల్యేగా నటించిందిగా ఆ భామ. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క పేరును ఫైన‌లైజ్ చేసిన‌ట్టు తెలుస్తున్న సంధర్భంలోనే ఈ సినిమాకు సంబంధించి ఈ  ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. చిరు ప్రెస్టేజియ‌స్ మూవీలో కేథ‌రిన్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నుంద‌ట‌.

ఈ సినిమాలో కీ రోల్‌తో పాటు చిరంజీవి సరసన ఓ పాటలో కూడా రొమ్యాన్స్ చెయ్యనున్నట్లు సమాచారం. సరైనోడు స‌క్సెస్ త‌ర్వాత కేథ‌రిన్ ఏకంగా చిరుతో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. మరి భారీ అంచనాలతో కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మెగాస్టార్ త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus