వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. దిగువ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. అంధ బాలల ఉండే దేవనార్ స్కూల్ లోకి నీరు చేరి ఇబ్బందులు పడుతుంటే వారికి మూడు రోజుల పాటు భోజనాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందించేందుకు ముందుకు వచ్చారు.
అలాగే అక్కడి బాలలకు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దుప్పట్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా నగరంలో ఎక్కడ ఇబ్బంది నెలకొన్నా అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టేందుకు బాహుబలి బృందం సిద్ధమైంది. నిరాశ్రయులైన వివరాలు అందిస్తే నేరుగా అక్కడకు వెళ్లి వారికి కావాల్సిన వస్తువులను ఇస్తామని రానా ట్విట్టర్ వేదికపై చెప్పారు.
వానకు దెబ్బతిన్న ప్రాంతాల వివరాలు ఇవ్వమని కోరారు. “చుట్టు పక్కల వర్షం లో చిక్కుకున్న వారిని రక్షించండి. వారికి షెల్టర్ ఇవ్వండి” అని మంచు మనోజ్ తన ఫాలోవర్స్ కి సూచించారు. ఇంకా కొంతమంది స్టార్లు నేరుగా వానలకు దెబ్బతిన్న వారిని కలుసుకొని సాయం చేయనున్నారు.
Getting info and relief material needed in Hyderabad and other affected ares!! Please post if any help is needed will try to reach you soon
— Rana Daggubati (@RanaDaggubati) September 23, 2016
Everyone pl tc and try helping people around u who r stuck in rains and drains .. Pl offer shelter and food🙏 #HyderabadRains
— Manchu Manoj (@HeroManoj1) September 23, 2016